ఈ మధ్యకాలంలో ఓటీటీల్లో విడుదలైన చాలా సిరీస్ లు భారీ సక్సెస్ ను అందుకున్నాయి. అందులో ముఖ్యంగా 'మనీ హైస్ట్' సిరీస్ మరింత పాపులర్ అయింది. స్పానిష్ కి చెందిన ఈ సిరీస్ ను వేరే భాషల్లో కూడా డబ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ కి మంచి గుర్తింపు లభించింది. తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అవైలబుల్ ఉంది.
ఈ సిరీస్ లో ప్రతీ క్యారెక్టర్ ఆడియన్స్ కు కనెక్ట్ అయింది. అందులో స్టాక్ హోమ్ అనే క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. ఈ నటి ఇంట్లో హిందువులు కొలిచే గణపతి చిత్రపటం ఉంది. హిందూ దేవుళ్లను, సంప్రదాయాలను ఇతర దేశాలకు చెందిన వారు కూడా పాటిస్తుంటారు.
ఇప్పుడు 'మనీ హైస్ట్' నటి ఎస్తర్ ఎసిబో ఇంట్లో వినాయకుడి పెయింటింగ్ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఎస్తర్ షేర్ చేసిన వీడియోలో గణేష్ పెయింటింగ్ కనిపించింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు నెటిజన్లు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. స్పానిష్ నటి ఇంట్లో హిందూ దేవుడి ఫొటో ఉండడం విశేషమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: 'సేనాపతి'కి మెగాస్టార్ రివ్యూ.. రాజేంద్రప్రసాద్ పై ప్రశంసలు..
Also Read: 'రాధేశ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?
Also Read: పూల్లోకి దూకిన నటి.. పాపం మెడ విరిగింది
Also Read: బాలయ్య కోసం 'క్రాక్' లేడీ.. లక్ కలిసొస్తుందా..?