దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. కానీ కొన్ని కారణాల వలన సినిమా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించబోతున్నారు రాజమౌళి. ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అలానే అల్లూరి సీతారామరాజుగా.. రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. 


అయితే ఇప్పుడు ఈ సినిమాపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య 'ఆర్ఆర్ఆర్' సినిమాపై పిల్ దాఖలు చేశారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ చరిత్ర వక్రీకరించారని ఆమె పిల్ లో పేర్కొన్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని, సినిమా విడుదలైన స్టే ఇవ్వాలని పిటిషనర్ ను కోరారు అల్లూరి సౌమ్య. 


జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం ముందుకు ఈ పిల్‌ విచారణకు వచ్చింది. పిల్‌ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం తెలిపింది. మరి ఈ విషయంపై 'ఆర్ఆర్ఆర్' చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి..!






Also Read: 'సేనాపతి'కి మెగాస్టార్ రివ్యూ.. రాజేంద్రప్రసాద్ పై ప్రశంసలు..


Also Read: 'రాధేశ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?


Also Read: పూల్‌లోకి దూకిన నటి.. పాపం మెడ విరిగింది


Also Read: బాలయ్య కోసం 'క్రాక్' లేడీ.. లక్ కలిసొస్తుందా..?


Also Read:ఫ్యాన్స్ కి షాకిచ్చిన ప్రభాస్.. 'ఆర్ఆర్ఆర్' రూట్ లోనే 'రాధేశ్యామ్'..


Also Read: హీరోగా ఎన్టీఆర్ బావమరిది.. డైరెక్టర్ ఎవరంటే..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి