ప్రముఖ ఆస్ట్రేలియన్ నటి, సింగర్, మోడల్ అలీ సింప్సన్ స్విమ్మింగ్ చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ది మాస్క్ డ్ సింగర్', 'ఐయామ్ ఏ సెలబ్రిటీ..గెట్ మీ అవుట్ ఆఫ్ ఇయర్(2021)' వంటి సిరీస్ లలో నటించి గురింపు తెచ్చుకున్న అలీ సింప్సన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫొటోను షేర్ చేసింది.
కొన్నిసార్లు మనం కళ్లు మూసి తెరిచేలోపు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయని.. నేనైతే కొత్త సంవత్సరాన్ని విరిగిన మెడతో, కరోనా పాజిటివ్ తో ప్రారంభించానని చెప్పింది. స్విమ్మింగ్ పూల్ లోకికి దూకగానే తన తన కింద నెలకు గట్టిగా తగిలిందని.. వెంటనే హాస్పిటల్ లో చేర్చగా.. అక్కడ ఎక్స్‌రే, సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్ అన్నీ చేసి తన మెడ ఫ్రాక్చర్ అయిన విషయాన్ని చెప్పినట్లు తెలిపింది.
సర్జరీ అవసరం లేదన్నారని.. మెడకు బ్యాండ్ వేసి ఇంటికి పంపించారని చెప్పింది. నాలుగు నెలల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సి ఉందని తెలిపింది. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడినందుకు అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు సపోర్ట్ గా నిలిచి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి థాంక్స్ చెప్పింది.
తనకు ట్రీట్మెంట్ అందిస్తున్న హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ.. అందరూ తనలా కాకుండా గొప్పగా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. చివరిగా లోతు తెలియకుండా దేనిలోనూ దూకకండి అంటూ సూచించింది.
Also Read: బాలయ్య కోసం 'క్రాక్' లేడీ.. లక్ కలిసొస్తుందా..?
Also Read:ఫ్యాన్స్ కి షాకిచ్చిన ప్రభాస్.. 'ఆర్ఆర్ఆర్' రూట్ లోనే 'రాధేశ్యామ్'..
Also Read: హీరోగా ఎన్టీఆర్ బావమరిది.. డైరెక్టర్ ఎవరంటే..?
Also Read: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ..
Also Read: 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ రోల్ ఇదే.. రివీల్ చేసిన నిర్మాత..
Also Read: సంక్రాంతి రేసులో డబ్బింగ్ సినిమాలు.. అజిత్ Vs విశాల్..