మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌పై సొంత పార్టీకే చెందిన కింది స్థాయి నేత ఒకరు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. శ్రీనివాస్ గౌడ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ టీఆర్ఎస్ కౌన్సిలర్ మానవ హక్కుల సంఘాన్ని (హెచ్చార్సీ) ఆశ్రయించారు. మంత్రి వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ.. పోలీసుల ద్వారా తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ బాధితుడైన కౌన్సిలర్ పేర్కొన్నారు. 


ప్రస్తుతం వి. శ్రీనివాస్ గౌడ్.. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయనపైనే మహబూబ్ నగర్ పట్టణంలోని రాంనగర్ 43వ వార్డ్‌ టీఆర్ఎస్‌ కౌన్సిలర్ బూర్జు సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మహబూబ్ నగర్‌‌లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై మంత్రి కేటీఆర్, అధికారులకు తాను ఫిర్యాదు చేశాననే ఉద్దేశంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తనపై కక్ష పెంచుకున్నారని సుధాకర్ రెడ్డి చెప్పారు. అందుకే శ్రీనివాస్‌ గౌడ్‌ పోలీసులతో కుమ్మక్కై తనను వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి తనను హత్య చేయించాలని చూస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ కోరారు.


మంత్రి సూచనల మేరకే పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరారు. అంతేకాక, మంత్రి కేటీఆర్‌‌కు కూడా సుధాకర్ రెడ్డి విన్నవించుకున్నారు.


Also Read: అక్కడ ఆస్పత్రిలో హార్ట్ ఎటాక్‌తో తల్లి... ఇక్కడ ఇండియాలో కేసుల్లో చిక్కుకున్న హీరోయిన్!


కౌన్సిలర్‌పైనే కేసు నమోదు
హెచ్చార్సీలో ఫిర్యాదు చేసిన కౌన్సిలర్​పై కొద్ది గంటల్లోనే చర్యలు పార్టీ నుంచి బహిష్కరించారు. రంగంలోకి దిగిన రెవెన్యూ ఆఫీసర్లు మున్సిపాలిటీలో భూ ఆక్రమణలపై విచారణ చేశారు. కౌన్సిలర్ భూ కబ్జా చేశాడంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంనగర్ హైస్కూల్​ఏరియాలో స్కూల్ జాగా కబ్జా అయిందని.. బురుజు సుధాకర్ రెడ్డి 680 గజాల స్థలాన్ని ఆక్రమించి ఫేక్​రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలిందని తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. మరోవైపు, మంత్రిపై ఫిర్యాదు చేసిన కౌన్సిలర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మహబూబ్ నగర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాద్మి శివకుమార్ ప్రకటించారు. ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం కాలనీ వాసుల నుంచి సుధాకర్​రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.


Also Read: RGV Vs Perni Nani: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు


Also Read: ఖరీదైన ఆడి కారు కొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్... అంత రేటు పెట్టి కొన్నారా?


Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి