సినీ అభిమానులే కాదు, సాధారణ ప్రజలు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. కరోనా సమయంలో థియేటర్లు మూసేసిన వేళ వారికి వినోదాన్ని పంచింది ఓటీటీలే కదా. అందుకే ఇప్పటికీ ఓటీటీలో సినిమాలు చూసేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. అందుకే థియేటర్లో విడుదలైన సినిమాలను కూడా కొన్ని రోజుల తరువాత ఓటీటీలకు అమ్ముతున్నారు. ఇందులో మూవీ మేకర్స్‌కు కూడా లాభమే. సినిమా స్థాయిని బట్టి పదికోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఇచ్చేందుకు, అవసరమైతే అంతకన్నా ఎక్కువ చెల్లించేందుకు కూడా ఓటీటీలు వెనుకాడడం లేదు. కాబట్టి థియేటర్లో కొన్ని రోజులు నడిచాక, ఓటీటీలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు నిర్మాతలు. అయితే జనవరి నెలలో ప్రేక్షకులకు సంక్రాంతి పండుగే  కాదు, సినిమా జాతర కూడా జరగనుంది. భారీ సినిమాలు ఓటీటీలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 


పుష్ప ఎప్పుడంటే...
సుకుమార్-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కి థియేటర్లో కొన్ని రోజుల పాటూ కలెక్షన్ల దుమ్మురేపిన సినిమా ‘పుష్ప’. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ బాట పట్టనుంది. భోగీ రోజు అంటే జనవరి 7న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇందుకోసం ప్రైమ్ భారీమొత్తంలో చెల్లించినట్టు సమాచారం. పుష్ప తెలుగు వెర్షన్‌తో పాటూ, తమిళ, మలయాళం కన్నడ కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ మేరకు ప్రైమ్‌ ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటించింది.



అఖండ కూడా...
గతేడాది విడుదలైన మరో భారీ చిత్రం అఖండ. థియేటర్ల ముందు మళ్లీ హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేంత స్థాయిలో విజయం సాధించింది ఈ సినిమా. బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కూడా ఈ నెలలోనే హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో సినిమా శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన సినిమా ‘పెళ్లిసందడి’. దీన్ని కూడా హాట్‌స్టార్‌లోనే సంక్రాంతి కానుకగా జనవరి 14న స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే వీటిపై ఇంకా ఆయా ఓటీటీలు అధికారికంగా ప్రకటనలు ఇవ్వాల్సి ఉంది.


Also Read: ఇది చాలా టఫ్ టైం.. 'రాధేశ్యామ్' దర్శకుడు హింట్ ఇస్తున్నాడా..?


Also Read: ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. వర్మ ఫైర్..


Also Read: రాజమౌళితో కరణ్ జోహార్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?


Also Read: బాధలో దీప్తి సునయన.. చిల్ అవుతోన్న సిరి, షణ్ముఖ్..


Also Read: 'నాయట్టు' రీమేక్.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?


Also Read: రోజుకి కోటి రూపాయలా..? నిర్మాతకు షాకిచ్చిన విజయ్ సేతుపతి..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి