మలయాళంలో సూపర్ హిట్ అయిన 'నాయట్టు' సినిమా రీమేక్ హక్కులను దక్కించుకుంది గీతాఆర్ట్స్ సంస్థ. రావు రమేష్, ప్రియదర్శి, అంజలి ప్రధాన పాత్రల్లో ఈ సినిమా చేయాలనుకున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. 'పలాస' సినిమాను డైరెక్ట్ చేసిన కరుణ కుమార్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. మరికొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనుకుంటున్న సమయంలో ప్రాజెక్ట్ ఆగిపోయింది. 


కరుణకుమార్ మరో ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో పడ్డారు. అయితే దీనికి గల కారణాలేంటో ఇప్పుడు బయటకొచ్చాయి. బడ్జెట్ సమస్య కారణంగానే సినిమాను పక్కన పెట్టేశారట. ఈ సినిమాను రూ.4 కోట్లలో తీయమని కరుణకుమార్ కి చెబితే.. బడ్జెట్ లెక్కలు వేసుకున్నప్పుడు రూ.8 కోట్లు తేలిందట. దర్శకుడిగా ఆయన రెమ్యునరేషన్ కోటిన్నర వరకు డిమాండ్ చేశారట కరుణకుమార్. 


నటుడు రావు రమేష్ కి కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. రూ.8 కోట్లలో సినిమా తీస్తే.. ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయా..? అనే సందేహంలో సినిమాను హోల్డ్ లో పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు 'నాయట్టు' డబ్బింగ్ రైట్స్ కూడా గీతాఆర్ట్స్ దగ్గరే ఉండడంతో.. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు డబ్ చేసి 'ఆహా'లో రిలీజ్ చేద్దామని అంటున్నారు. 


అయితే ఇప్పటికే దర్శకుడు కరుణకుమార్ కి అడ్వాన్స్ ఇవ్వడంతో.. ఆయనతో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తోంది గీతాఆర్ట్స్ సంస్థ. ఓ యంగ్ హీరో ఈ ప్రాజెక్ట్ లో నటించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. 


Also Read: రోజుకి కోటి రూపాయలా..? నిర్మాతకు షాకిచ్చిన విజయ్ సేతుపతి..




Also Read: హీరోయిన్ తో విక్రమ్ కొడుకు ప్రేమాయణం.. ఇద్దరూ ఒకే హోటల్ లో..


Also Read:ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆర్జీవీ.. అజయ్ భూపతిని ఆడేసుకుంటున్నారుగా..


Also Read:లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..




Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి