మనదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండటంతో.. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లతో పాటు.. ఎలక్ట్రిక్ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనికి తోడు ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ ధరలోనే మార్కెట్‌ను పలకరించడానికి సిద్ధం అయ్యాయి. గతేడాది దాదాపు ఏడు ఎలక్ట్రిక్ కార్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ సంవత్సరం లాంచ్ అవుతాయని అంచనాలు ఉన్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
1. టాటా అల్ట్రోజ్ ఈవీ
ఈ కారును మొదట జెనీవా మోటర్ షో 2019లో చూపించారు. టాటా అల్ట్రోజ్ ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. ట్రాన్స్‌మిషన్ టన్నెల్ అవసరం లేదు కాబట్టి.. ఈ కారు మరింత స్పేషియస్‌గా ఉండనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల రేంజ్‌ను ఇది అందించనుందని తెలుస్తోంది.
2. వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్
వోల్వో ఎక్స్‌సీ40ని మొదట మనదేశంలో గతదేశంలోనే ప్రదర్శించారు. దీనికి సంబంధించిన సేల్ కూడా గతేడాదే ప్రారంభం అవుతుంది అనుకున్నారు. కానీ సెమీకండక్టర్ల కొరత కారణంగా ఇది ఆలస్యం అయింది. అయితే ఈ సంవత్సరం మాత్రం లాంచ్ పక్కా అంటున్నారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఏకంగా 418 కిలోమీటర్ల రేంజ్‌ను ఈ కారు అందిస్తుందని తెలుస్తోంది.
3. మినీ కూపర్ ఎస్ఈ
ఈ కారు జనవరిలోనే మనదేశంలో లాంచ్ కానుంది. దీనికి సంబందించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. మినీ కంపెనీ లాంచ్ చేస్తున్న మొదటి ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు ఇదే. ప్రీ-బుకింగ్స్ ఓపెన్ అయిన రెండు గంటల్లోనే స్టాకు పూర్తిగా అయిపోవడం విశేషం. ఈ కారు ఒక్క చార్జ్‌తో 234 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది.
4. టెస్లా మోడల్ 3
ఈ కారుతోనే టెస్లా మనదేశంలో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఎలక్ట్రికల్ సెడాన్ కారు ఇప్పటికే మనదేశంలో టెస్టింగ్‌లో చాలా సార్లు కనిపించింది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లను ఉపయోగిస్తుంది. స్టాండర్డ్ మోడల్ ఒక్కసారి చార్జ్ చేస్తే 402.3 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఇందులో ఏఎండీ వేరియంట్ 518 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని కేవలం 4.4 సెకన్లలోనే 96.56 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుందని తెలుస్తోంది.
5. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ లగ్జరీ సెడాన్ విభాగంలో మనదేశంలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ కారుకు సంబంధించిన గ్లోబల్ లాంచ్ గతేడాదే జరిగింది. మనదేశంలో మాత్రం కొంచెం ఆలస్యంగా రానుంది. మెర్సిడెస్ బెంచ్ ఇండియా వెబ్ సైట్లో కూడా ఈ కారును లిస్ట్ చేశారు. ఈ కారు ఏకంగా 770 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది.
Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?