టాలీవుడ్ నిర్మాతగా, దర్శకుడిగా పేరు సంపాదించుకున్న తమ్మారెడ్డి భరద్వాజ సినిమాకి సంబంధించిన పలు విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. తాజాగా సినిమా టికెట్ల ధరలు, అలానే చిరంజీవి ఇండస్ట్రీ పెద్దపై చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందించారు. అసలు సినిమా టికెట్ ధరల తగ్గింపు అనేది పెద్ద సమస్య కాదని అన్నారాయన. టికెట్ ధరలు తగ్గించడం వలన చిన్న సినిమాలను సమస్య ఉండదని చెప్పారు.
ప్రజలందరికీ అందుబాటులో సినిమా టికెట్ ధరలు ఉండాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. టికెట్ ధరలు తగ్గించడం వలన కొంతమంది సంతోషపడుతున్నారని చెప్పుకొచ్చారు. టికెట్ రేట్లు తగ్గించడం వలన కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే సమస్య అని చెప్పారు. కాబట్టి పెద్ద సినిమాలను వేరే రేట్లు పెట్టమని ప్రభుత్వాన్ని కోరితే సరిపోతుందని సలహా ఇచ్చారాయన.
అలానే చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉండననే విషయంపై స్పందిస్తూ.. 'అందులో తప్పేముందని అన్నారు' తమ్మారెడ్డి భరద్వాజ. సినిమా ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి పెద్ద దిక్కుగా భావించిందని.. కానీ కొంతకాలంగా ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులతో ఆయన విసిగిపోయి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి.
అలానే సినిమా టికెట్ రేట్ విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడడానికి చిరంజీవి ముందుకు రాలేదనే విమర్శలపై కూడా ఆయన స్పందించారు. అసలు ఆయన ఈ విషయంపై ఎందుకు మాట్లాడాలని ప్రశ్నించారు తమ్మారెడ్డి. టికెట్ రేట్లపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అసోసియేషన్స్ స్పందించాలని చెప్పారాయన. వాళ్లతో పనులు జరగడం లేదనప్పుడు మాత్రమే చిరంజీవి, బాలకృష్ణ లేదంటే నాగార్జున, మోహన్ బాబు లాంటి వారి సాయం కోరాలని సూచించారు తమ్మారెడ్డి. ఈ వ్యాఖ్యలు యూట్యూబ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: 'సేనాపతి'కి మెగాస్టార్ రివ్యూ.. రాజేంద్రప్రసాద్ పై ప్రశంసలు..
Also Read: 'రాధేశ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?
Also Read: పూల్‌లోకి దూకిన నటి.. పాపం మెడ విరిగింది
Also Read: బాలయ్య కోసం 'క్రాక్' లేడీ.. లక్ కలిసొస్తుందా..?
Also Read:ఫ్యాన్స్ కి షాకిచ్చిన ప్రభాస్.. 'ఆర్ఆర్ఆర్' రూట్ లోనే 'రాధేశ్యామ్'..