News
News
X

Ponniyin Selvan-1: త్రిష, ఐశ్వర్య రాయ్‌‌పై మణిరత్నం ఆగ్రహం, మళ్లీ అలా కనిపించొద్దంటూ వార్నింగ్!

‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా షూటింగ్ సమయంలో నటి త్రిషకు దర్శకుడు మణిరత్నం క్లాస్ తీసుకున్నారట. ఐశ్వర్యతో కలిసి కనిపించొద్దని హెచ్చరించారట. ఎందుకంటే..

FOLLOW US: 

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’. అందాల తారలు ఐశ్వర్యరాయ్, త్రిష కలిసి నటించిన ఈ సినమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నది. త్వరలో విడుదలకు రెడీ అవుతున్నది. చారిత్రాత్మక చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ  రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే..  సెప్టెంబర్ 23 న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌ లోని JRC కన్వెన్షన్స్‌ లో   ప్రీ రిలీజ్ నిర్వహిస్తున్నారు.  ఈ వేడుకలో పలువురు ప్రముఖులు  హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూస్తుంటే మణిరత్నం మరోసారి తన సత్తా నిరూపించుకోనున్నట్లు తెలుస్తోంది. అటు ఈ చిత్రంలో నటించిన యాక్టర్లు డిజిటల్, శాటిలైట్ ఛానెల్స్ కు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిష ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది. 

‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ ఎంతో జాలీగా కొనసాగిందని త్రిష తెలిపింది. బాలీవుడ్ టాప్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ తో కలిసి పని చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఐశ్వర్య రూపం అందంగా ఉండటమే కాదు, తన మనసు కూడా అంతే అందంగా ఉంటుందని చెప్పింది. ఈ సినిమాలో ఇద్దరు బద్ద వ్యతిరేకులుగా కనిపిస్తారట. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గున మండుతుందట. సెట్స్ లో మాత్రం సరదాగా ఉండేవారట. దీంతో దర్శకుడు మణిరత్నం ఇద్దరికి క్లాస్ తీసుకున్నారట. మీరిద్దరు సెట్స్ లో కలిసి తిరగకూడదని వార్నింగ్ ఇచ్చారట.

మణిరత్నం కోపం వెనుక ఓ కారణం ఉందట. సినిమాలో ఇద్దరు ఒకరంటే ఒకరికి పడని క్యారెక్టర్లు చేస్తున్నారట. అందుకే, ఇద్దరు కలసి సంతోషంగా కబుర్లు చెప్పుకోవడం మూలంగా షూటింగ్ సమయంలో ఇద్దరు సీరియస్ గా యాక్టింగ్ చేయలేకపోతున్నారట.  అందుకే ఇద్దరు కలవకుండా ఉండాలని ఆయన వార్నింగ్ ఇచ్చారట. మణిరత్నం హెచ్చరిక తర్వాత సెట్స్ లో ఐశ్వరతో కాస్త దూరంగా ఉన్నట్లు త్రిష వెల్లడించింది.  అటు ఐశ్వర్యపై త్రిష ప్రశంసలు కురిపించింది. బాలీవుడ్ అగ్ర నటి అయినా తను ఎంతో కలిసిపోయే గుణాన్ని కలిగి ఉందని చెప్పింది. చక్కటి తమిళం మాట్లాడగలుగుతుందని వెల్లడించింది. ఆమెతో కలిసి పని చేయడం చాలా గౌరవంగా భావిస్తానని చెప్పింది. ఈ చిత్రంలో ఇళయ పిరట్టి కుందవై దేవి పాత్రలో త్రిష కృష్ణన్ నటిస్తుండగా, నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్ యాక్ట్ చేస్తున్నది.  ఈ మూవీలో ఐశ్వర్య ద్విపాత్రాభినయం చేస్తుందట. అందులో ఒక పాత్ర నెగిటీవ్ షేడ్స్‌తో ఉండనుందట. త్రిష కూడా  ఆసక్తికరమైన పాత్రలో కనిపించనుందట. మొత్తానికి వీరిద్దరూ తొలిసారిగా స్క్రీన్‌ షేర్ చేసుకుంటున్నారు. చోళ రాజకుమారులుగా  విక్రమ్, జయం రవి, కార్తీ, శోభిత ధూళిపాళ  నటిస్తున్నారు.  మద్రాస్ టాకీస్,  లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.  

Also Read: క్రియేటివిటీకి కళ్లజోడు పెడితే.. సింగీతం శ్రీనివాసరావు 

Also Read : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!

Published at : 22 Sep 2022 05:38 PM (IST) Tags: Mani Ratnam Ponniyin Selvan Trisha Aishwarya

సంబంధిత కథనాలు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా - ప్రచారంలో కొత్త టైటిల్స్!

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా - ప్రచారంలో కొత్త టైటిల్స్!

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

Hanuman Teaser: రాముడి కోసం ‘హనుమాన్’ వెనక్కి - రిలీజ్‌లనే కాదు టీజర్లనూ వాయిదా వేస్తారా?

Hanuman Teaser: రాముడి కోసం ‘హనుమాన్’ వెనక్కి - రిలీజ్‌లనే కాదు టీజర్లనూ వాయిదా వేస్తారా?

Allari Naresh: అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Allari Naresh: అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’  రిలీజ్ డేట్ ఫిక్స్!

టాప్ స్టోరీస్

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Anchor Sreemukhi: డాన్స్ ఐకాన్ కోసం ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయిన శ్రీముఖి

Anchor Sreemukhi:  డాన్స్ ఐకాన్ కోసం ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోయిన శ్రీముఖి

Lottery : లక్కీ బర్త్ డే, పుట్టిన రోజు డేట్‌తో 200 లాటరీ టికెట్లు కొన్నాడు, ఏకంగా జాక్‌పాట్ కొట్టేశాడు!

Lottery : లక్కీ బర్త్ డే, పుట్టిన రోజు డేట్‌తో 200 లాటరీ టికెట్లు కొన్నాడు, ఏకంగా జాక్‌పాట్ కొట్టేశాడు!

Honor New Launch: కొత్త ట్యాబ్లెట్‌తో రానున్న హానర్ - భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో!

Honor New Launch: కొత్త ట్యాబ్లెట్‌తో రానున్న హానర్ - భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో!