By: ABP Desam | Updated at : 18 Jun 2023 04:01 PM (IST)
జేడీ చక్రవర్తి(Image Credits: JD Chakraborty - Vishnu Priya/Instagram)
JD Chakraborty - Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియతో జేడీ చక్రవర్తి పెళ్లి జరగనుందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. జేడీ చక్రవర్తి గారి తల్లి ఒప్పుకుంటే తమ పెళ్లి జరుగుతుందని ఇటీవలే విష్ణు ప్రియ చెప్పడంతో ఈ రూమర్స్ కు మరింత ఆజ్యం పోసినట్టయింది. అసలు నిజంగా ఇది నిజమేనా... లేదంటే ఏదైనా ప్రమోషన్ ఫ్రంట్ లో భాగమా అని చాలా మంది పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సందేహాలు, అనుమానాలను జేడీ చక్రవకర్తి తాజాగా నివృత్తి చేశారు. అసలేమైంది, ఎందుకు ఆ తరహా వార్తలొచ్చాయి.. నిజంగా విష్ణు ప్రియ చెప్పింది నిజమేనా.. ఒకవేళ అది నిజం కాకపోతే ఆమె అలా ఎందుకు చెప్తుంది.. లాంటి అనుమానాలపై జేడీ చక్రవర్తి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
నిజంగా విష్ణు ప్రియను పెళ్లి చేసుకుంటున్నారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు జేడీ చక్రవర్తి సమాధానమిచ్చారు. "మంచి మానవత్వం ఉన్న మనుషులలో విష్ణు ప్రియ ఒకరు. తను అలా చెప్పడానికి గల కారణమేమిటంటే.. మేము ఇటీవల ఓ సిరీస్ చేశాం. అది కొన్ని రోజుల్లోనే రిలీజ్ కానుంది. ఆ సిరీస్ డైరెక్టర్ పేరు పవన్ సాదినేని. రాము గారు, వంశీ, మణిరత్నంలతో సమానమైన డైరెక్టర్. అయితే ఈ సిరీస్ లో భాగంగా విష్ణు ప్రియ, నేను ట్రావెల్ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ తనకు చెప్పిందేంటంటే.. జేడీ గారి మూవీస్ రోజుకు ఒకటి చూడు. నువ్వు చాలా నేర్చుకోవచ్చు అని. అప్పట్నుంచి తను నా క్యారెక్టర్ ను ఫాలో అవుతూ వచ్చింది. అలా కేవలం తన క్యారెక్టర్ ను ఫాలో అవుతూ వచ్చింది తప్ప నన్ను కాదు. ఆ ఉద్దేశంతో విష్ణు ఆ మాటలు చెప్పింది తప్ప.. తను నిజంగా అలా చేయదు. నాకు అతి తక్కువ ఫోన్లు, మెసేజ్ లు చేసే వాళ్లలో విష్ణు ప్రియ ఒకరు. నాకు, తనకు మధ్య గురువు, శిష్యురాలి మధ్య ఉన్న అనుబంధమే తప్ప ఇంకేం లేదు" అని జేడీ చక్రవర్తి కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు.
ఇక టెలివిజన్ యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం తన పెళ్లి రూమర్స్ తో సోషల్ మీడియాలై ట్రెండ్ అవుతోంది. ఇటీవలే ఓ షోలో పాల్గొన్న ఆమె.. తనకు సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. వాళ్ల ఇంట్లో ఒప్పుకుంటే ఆయన్నే చేసుకుంటానంటూ ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ఉందంటూ అభిమానులు తెగ కామెంట్లు పెట్టారు. ఇది నిజమేనని చాలా మంది భావించారు కూడా. తాజాగా ఈ విషయంపై స్వయంగా ఆ నటుడే స్పందించి క్లారిటీ ఇచ్చారు. జేడీ చక్రవర్తి ఇచ్చిన క్లారిటీతోనైనా ఈ ప్రచారం ఇక్కడితో ఆగిపోతుందా.. లేదంటే కంటిన్యూ అవుతుందా అన్నది వేచి చూడాలి మరి.
Read Also : Heart of Stone trailer: ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది - విలన్‌గా అలియా భట్ అదరగొట్టిందిగా!
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!
Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?
Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్
Rashmika Mandanna: అప్పుడు విమర్శలు, ఇప్పుడు ప్రశంసలు - రష్మిక నటనకు నెటిజన్లు ఫిదా
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్
/body>