By: ABP Desam | Updated at : 11 Jul 2022 10:52 AM (IST)
'జిన్నా'లో విష్ణు మంచు
విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు నటిస్తున్నారు. ఈ రోజు ఆ పాత్ర ఫస్ట్ లుక్ (Ginna Movie First Look) విడుదల చేశారు.
'జిన్నా'లో విష్ణు మంచు ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో రొటీన్‌కి భిన్నంగా, కాస్త కొత్తగా విడుదల చేశారు. షాట్ రెడీ అయ్యిందని విష్ణును ఫైట్ మాస్టర్ రామకృష్ణన్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు అందరూ పిలుస్తారు. 'విష్ణు గారు... షాట్ రెడీ' అని అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్ర పిలుస్తారు. అయితే విష్ణు మంచు రారు. తర్వాత విషయం తెలుసుకున్న ప్రేమ్ రక్షిత్ 'జిన్నా... షాట్ రెడీ' అని పిలవమని సలహా ఇస్తారు. అప్పుడు విష్ణు వస్తారు. వైట్ అండ్ వైట్ డ్రస్‌లో కళ్ళజోడు పెట్టుకుని, చేతికి ఆంజనేయ స్వామి, ఓంకారం ఉన్న కడియం ధరించారు విష్ణు.
ఈ సినిమాలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), రేణుకగా సన్నీ లియోన్ (Sunny Leone) నటిస్తున్నారు. ఇందులోని పాటలకు ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు (Mohan Babu) ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి మూల కథ అందించగా... కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఆయనే క్రియేటివ్ ప్రొడ్యూసర్. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, 'చమ్మక్' చంద్ర, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు.
Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!
NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!
Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!
INDW vs AUSW CWG 2022 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా - గోల్డ్ కోసం దేనికైనా రెడీ అన్న హర్మన్!
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్‌కు స్వర్ణం
ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది
Rabindranath Tagore: ఐన్‌స్టీన్, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?