Thanal Telugu Release Date: 'డీఎన్ఏ'కు పేరొచ్చింది... ఇప్పుడు 'టన్నెల్'తో హిట్ కొడతాడా?
Atharva's Thanal Telugu Title: కోలీవుడ్ యంగ్ హీరో, వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్'లో నటించిన అథర్వా మురళీ మరో సినిమా 'టన్నెల్'తో తెలుగు పేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.

కోలీవుడ్ యంగ్ హీరో అథర్వా మురళీ (Atharvaa Murali) గుర్తు ఉన్నారా? మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్'లో నటించారు. 'డీఎన్ఏ' అంటూ ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించారు. విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి పేరొచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన మర్నాడు ఓటీటీలోకి వచ్చింది. దాంతో మంచి సినిమా అనే పేరు మాత్రమే మిగిలింది. ఇప్పుడు తన కొత్త సినిమాను తెలుగులో కూడా సేమ్ డే రిలీజ్ చేస్తున్నాడు అథర్వా.
తెలుగులోకి 'టన్నెల్'గా అథర్వా సినిమా!
Atharvaa Murali's Tunnel movie update: అథర్వా మురళీ కథానాయకుడిగా క్రైమ్ & సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన లేటెస్ట్ తమిళ్ సినిమా 'థనల్'. దీనిని తెలుగులో 'టన్నెల్'గా డబ్బింగ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. దాంతో తెలుగులోనూ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో లచ్చు రామ్ ప్రొడక్షన్స్ ద్వారా ఎ రాజు నాయక్ విడుదల చేస్తున్నారు.
పోలీసుగా అథర్వా... ప్రేయసిగా లావణ్య!
'టన్నెల్'లో అథర్వా మురళీ పోలీస్ రోల్ చేశారు. అతను ప్రేమించిన అమ్మాయిగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి కనిపించారు. పోలీస్ ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక నైట్ డ్యూటీలో బస్తీకి వెళతారు. అక్కడ కొందరు పోలీసులను చంపడానికి మీదకు వస్తారు. వాళ్ళు ఎవరు? హీరో ఎలా ఆపాడు? అనేది కథగా తెలుస్తోంది. 'యూనిఫామ్ వేసుకున్న తర్వాత అందరూ ఫ్యామిలీనే' అంటూ హీరో చెప్పిన బావుంది.
Also Read: తమిళ్ దర్శకులకు ఏమైంది? బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు... అసలు కారణాలివే!
యాక్షన్ ప్యాక్డ్ ఫైట్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్... రెండిటినీ మేళవించి 'టన్నెల్' చేశారని అర్థం అవుతోంది. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అశ్విన్ కాకుమాను విలన్. ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, సినిమాటోగ్రాఫర్: శక్తి శరవణన్, ఎడిటర్: కలైవానన్.
Also Read: హీరోయిన్లకు ఏమైంది? తాప్సీ to జ్యోతిక వయా కమలినీ ముఖర్జీ... అవసరం తీరాక టాలీవుడ్ మీద విమర్శలు!?



















