Surekha Vani: ఆడపిల్లను ఇండస్ట్రీకి తీసుకురావాలంటే భయం - కూతురిని హీరోయిన్ చేయడంపై సురేఖా వాణి వ్యాఖ్యలు
Surekha Vani Daughter: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో ఎంతో గుర్తింపు సాధించింది సురేఖ వాణి. ఇప్పుడు తన కూతురు సుప్రితను కూడా హీరోయిన్ చేయడానికి సిద్ధమయ్యింది.
Surekha Vani Daughter Supritha: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి అంటే చాలామంది తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలుసు. తను సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ.. ఇప్పటికీ ఫ్యాన్స్ మతిపోగొట్టే ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ ఉంటారు. తనతో పాటు తన కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నెటిజన్లకు తెలుసు. ఈ తల్లీకూతుళ్లు కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే రీల్స్‌కు లక్షలకొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు సురేఖా వాణి కూతురు సుప్రిత వెండితెరపై అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. తాజాగా సుప్రిత మొదటి సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో సురేఖా వాణి కూడా పాల్గొన్నారు.
ఆయనే కారణం..
తాజాగా సురేఖా వాణి.. తన కూతురితో కలిసి తిరుపతి వెళ్లారు. అక్కడ తను గుండు కూడా చేయించుకున్నారు. తన న్యూ లుక్ కూడా బాగుందంటూ ఇప్పటికే ఎంతోమంది నెటిజన్లు పాజిటివ్‌గా మాట్లాడారు. ఇక సుప్రిత సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో ముందుగా తన లుక్ గురించి మాట్లాడారు సురేఖా వాణి. ‘‘నా కొత్త లుక్‌తో కొత్తగా ఉంది నాకు కూడా’’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత సుప్రిత సినిమా గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ‘‘ఈ సినిమా నేను ఒప్పుకోవాలా లేదా చేస్తానా లేదా అని సందేహంలో ఉన్నప్పుడు రఘు అన్న కాదు.. అన్న అంటే ఫీల్ అవుతాడు రఘు డార్లింగ్ చాలా సపోర్ట్ చేసి డైరెక్టర్, ప్రొడ్యూసర్ గురించి స్పష్టంగా చెప్తే నాకొక ధైర్యం వచ్చింది’’ అంటూ తను సినిమా చేయడానికి ముఖ్య కారణం కమెడియన్ రఘు అని చెప్పుకొచ్చారు సురేఖా వాణి.
అప్పుడు ధైర్యం వచ్చింది..
‘‘ఆ తర్వాత నేను డైరెక్టర్ మహేంద్రని కలవడానికి ఆఫీస్‌కు వెళ్లాను. వాళ్లు చాలా చాలా మంచి మనుషులు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇద్దరూ. ఆడపిల్లను సినిమా ఇండస్ట్రీకి తీసుకురావచ్చా లేదా అని చాలామందికి భయాలు ఉంటాయి. ఒక తల్లిగా నాకు కూడా కొంచెం అలాంటిది ఉంది. వీళ్లు ఎంతవరకు చేయగలరు అని చిన్న భయం ఉంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌ను చూసిన తర్వాత ధైర్యం వచ్చింది. కళ్లు మూసుకొని వీళ్ల చేతిలో నేను పెట్టొచ్చు అనిపించింది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధించాలి’’ అని సురేఖా అన్నారు. ఇక ఈ మూవీలో సుప్రితకు జోడీగా బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ నటిస్తున్నాడు.
ఫస్ట్ స్టెప్‌లోనే సక్సెస్..
అమర్‌దీప్ గురించి కూడా సురేఖా వాణి మాట్లాడారు. ‘‘నా తమ్ముడు అమర్, నా కూతురు సుప్రితను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఇంతమందిని చూస్తుంటే ఇంతమంచి సక్సెస్ ఫస్ట్ స్టెప్‌లోనే వచ్చింది అనిపిస్తుంది. థాంక్యూ’’ అంటూ ప్రేక్షకులను నమస్కరించారు సురేఖా వాణి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో స్వీకరించారు. ఇక హీరోయిన్‌గా తన కూతురు సుప్రిత ఎంతమేరకు ప్రేక్షకులను ఇంప్రెస్ చేయగలదో చూడాలి. అయితే సుప్రిత ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌తో పాటు యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా చాలామందికి దగ్గరయ్యింది. ఇప్పుడు మొదటిసారి హీరోయిన్‌గా వెండితెరపై మెరవనుంది.
Also Read: హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సురేఖ వాణి కూతురు, ‘బిగ్ బాస్’ అమర్ దీప్‌తో సుప్రిత కొత్త మూవీ