భళా ‘జైలర్’ - బాక్సాఫీస్ వద్ద రజనీ సినిమా రచ్చ రంబోలా, మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆగస్టు 10న రిలీజ్ అయిన ఈ మూవీ తాజాగా రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా 'జైలర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 10న విడుదలైన తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.500 కోట్ల మార్కును దాటేసింది. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా రజనీకాంత్ కి వరుస ప్లాపులు రావడంతో ఆయన మార్కెట్ పూర్తిగా పడిపోయింది. దీంతో రజనీ పని అయిపోయిందని అనుకున్నారంతా. కానీ 'జైలర్' తో ఒక్కసారిగా భారీ కం బ్యాక్ ఇచ్చారు సూపర్ స్టార్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వింటేజ్ రజిని మార్క్ ఓ రేంజ్ లో ఉండడంతో ఫ్యాన్స్, ఆడియన్స్ పండగ చేసుకున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసింది.
మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు ఇండియా వైడ్ గా రూ.300 కోట్ల దిశగా దూసుకుపోతోంది. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కొడుకు కోసం పోరాడే రిటైర్డ్ జైలర్ పాత్రలో రజనీకాంత్ తన స్టైల్, స్వాగ్, యాక్షన్, నటనతో అదరగొట్టేసారు. అలాగే కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటితోపాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ప్లస్ అయింది. తమిళ, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ 'జైలర్' మంచి ప్రదర్శనను కనబరిచింది. సినిమా విడుదలై మూడు వారాలు అవుతుండగా, మూడో వారంలో కలెక్షన్స్ కాస్త తగ్గాయి. ఇప్పటివరకు ఇండియా వైడ్ గా రూ.295 కోట్లు వసూలు చేసి రూ.300 కోట్ల దిశగా దూసుకుపోతోంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల గ్రాస్ అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రజనీకాంత్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకోవడంతోపాటు తక్కువ టైంలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా 'జైలర్' నిలవడం విశేషం. సన్ మీడియా పిక్చర్స్ కళానిధి రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్, వసంత్ రవి, మిర్ణా మీనన్, వినాయకన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కాగా ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది.
థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత 'జైలర్' ప్రముఖ ఓటీటీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీన సన్ నెక్స్ట్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఒకవేళ థియేటర్లో కలెక్షన్స్ స్థిరంగా ఉంటే ఓటీటీ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయమై చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read : సెన్సార్‌పై ‘OMG 2’ డైరెక్టర్ గుర్రు - ఓటీటీలో అన్‌కట్ వెర్షన్ రిలీజ్ చేస్తారట!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial