News
News
వీడియోలు ఆటలు
X

శ్రీదేవి to ఇలియానా - పెళ్లికి ముందే గర్భం దాల్చిన హీరోయిన్లు వీరే, లిస్టు పెద్దదే!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు సర్వసాధారణమే. అయితే, ఈ మధ్య ప్రెగ్నెన్సీలు కూడా బాగా ట్రెండవ్వుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి కాకుండానే గర్భం దాల్చడం సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

FOLLOW US: 
Share:

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్స్ అనేవి చాలా కామన్. కొందరు తమ రిలేషన్ ను పెళ్లి దాకా కొనసాగిస్తే.. మరికొన్ని జంటలు మధ్యలోనే ఎవరిదారి వారు చూసుకుంటారు. మరికొంత మంది హీరోయిన్స్ మాత్రం డేటింగ్ లో ఉన్నప్పుడే గర్భం దాల్చి పిల్లలకు జన్మనిచ్చారు. నిజానికి పెళ్లి కాకుండానే గర్భం దాల్చడం అనేది చాలా ఏళ్ళ నుంచే సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ గా కొనసాగుతోంది. ఇప్పుడు లేటెస్టుగా హీరోయిన్ ఇలియానా ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ వివాహానికి ముందే గర్భవతులైన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం!.

1. శ్రీదేవి:

1980స్ లో అగ్ర కథానాయికగా వెలుగొందిన అతిలోక సుందరి శ్రీదేవి.. 1985లో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగా నిర్మాత బోనీ కపూర్ తో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన ఆమె.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. బోనీతో వివాహం జరిగే సమయానికి శ్రీదేవి 7 నెలల గర్భవతిగా ఉండటం అప్పట్లో సంచలనంగా మారింది. 1996లో పెళ్లి తర్వాత ఆమె కొన్నాళ్లుపాటు సినిమా నుంచి బ్రేక్ తీసుకుంది.

2. సారిక:

బాలీవుడ్ సీనియర్ నటి సారిక విశ్వ నటుడు కమల్ హాసన్ ప్రేమించుకున్న సంగతి అందరికి తెలిసిందే. లివింగ్ రిలేషన్లో ఉన్న వీరిద్దరూ పెళ్లి కాకుండానే 1986లో శ్రుతిహాసన్ కు జన్మనిచ్చారు. 1988లో వివాహం చేసుకున్న తర్వాత అక్షర హాసన్ పుట్టింది. కమల్ - సారికలు 2004లో విడిపోయారు.

3. కొంకణా సేన్ శర్మ:

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కొంకణా సేన్ శర్మ కూడా పెళ్లికి ముందే గర్భవతి అయ్యింది. నటుడు రణవీర్ షోరేతో డేటింగ్ చేసిన ఆమె.. 2010లో వివాహ బంధంలో అడుగుపెట్టింది. అయితే పెళ్ళైన కొన్ని నెలలకే తాము తల్లిదండ్రులు అయినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ జంట విడివిడిగా ఉంటున్నారని తెలుస్తోంది.

4. కల్కి కొచ్లిన్:

బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొక్లెయిన్ మొదట దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత హర్ష్ బెర్గ్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించిన కల్కి.. అతన్ని పెళ్లి చేసుకోకుండానే గర్భం దాల్చడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

4. రేణు దేశాయ్:

'బద్రి' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ఆ సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ప్రేమలో పడింది. ఈ క్రమంలో కొన్నాళ్ల పాటు సహాజీవనం చేసిన ఈ జంట 2004 లో అకీరా నందన్ కు జన్మనిచ్చారు. ఆ తర్వాత నెలకొన్న పరిస్థితుల కారణంగా 2009లో అకీరా సమక్షంలో పెళ్లి చేసుకుని వీరిద్దరూ భార్యభర్తలయ్యారు. అయితే మరో బిడ్డ పుట్టిన తర్వాత ఈ జంట 12 ఏళ్ళ బంధానికి స్వస్తి పలికి విడాకులు తీసుకున్నారు.

5. అమీ జాక్సన్:

ఎవడు, ఐ, రోబో 2.0.. సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైన అమీ జాక్సన్.. తన బాయ్ ఫ్రెండ్ జార్జ్తో చాలా ఏళ్లుగా డేటింగ్ చేస్తోంది. అప్పుడెప్పుడో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ కపుల్.. అప్పట్లోనే ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. కానీ వీరు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తుండటం గమనార్హం. 

6. అలియా భట్:

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా పెళ్లికి ముందే గర్భవతి అయింది. తన ప్రియుడు, హీరో రణబీర్ కపూర్ తో 14 ఏప్రిల్ 2022న అలియా వివాహం జరిగింది. అయితే రెండు నెలలు తిరక్కుండానే వారు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని స్వయంగా ప్రకటించి సంచలనం రేపారు. వీరికి పండంటి ఆడ పిల్ల జన్మించింది.

7. నీనా గుప్తా:

బాలీవుడ్ నటి నీనా గుప్తా వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో డేటింగ్ చేసింది. అయితే ఆమె గర్భవతిగా ఉన్న సమయంలోనే ఇద్దరూ విడిపోయారు. రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు అంగీకరించపోవడంతో వీరు బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. సింగిల్ మథర్ గానే కుమార్తె మసాబా గుప్తాను పోషించిన నీనా.. ఆ తర్వాత వ్యాపారవేత్త వివేక్ మెహ్రాను వివాహం చేసుకుంది.

8. సెలీనా జైట్లీ:

నో ఎంట్రీ, అప్నా సప్నా, గోల్మాల్ రిటర్న్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సెలీనా.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. 2011లో దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్ ని వివాహం చేసుకున్న ఆమె.. కొద్ది నెలలకే 2012లో కవల పిల్లలకు జన్మనిచ్చింది. 

9. మహిమా చౌదరి:

బాలీవుడ్ నటి మహిమ 2006లో వ్యాపారవేత్త బాబీ ముఖర్జీని వివాహం చేసుకుంది. అయితే పెళ్ళైన కొన్ని నెలలకే ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనివ్వడంతో.. అంతకుముందే గర్భం దాల్చినట్లు స్పష్టమైంది.

10. అమృత అరోరా:

నటి అమృత అరోరా అప్పటికే విడాకులు తీసుకున్న వ్యాపారవేత్త షకీల్ లడక్ ను 2009లో పెళ్లి చేసుకుంది. అయితే అదే యేడాది మార్చిలోనే అమృత గర్భం దాల్చిందని వార్తల్లోకెక్కింది. ఆ తర్వాతే తన ప్రియుడిని పెళ్లాడింది. 

11. వీణా మాలిక్:

పాకిస్థాన్ మోడల్, టీవీ నటి వీణా మాలిక్ పలు బాలీవుడ్ సినిమాలలో కనిపించింది. తన బోల్డ్ నెస్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ.. మాజీ ప్రియుడు ప్రశాంత్ ప్రతాప్ సింగ్ ద్వారా గర్భం దాల్చింది. అయితే ఆమె సింగ్ తో బ్రేకప్ చెప్పి, ఆ తర్వాత అసద్ బషీర్ ఖాన్ ఖట్టక్ ను వివాహం చేసుకుంది. 

12. దియా మీర్జా:

బాలీవుడ్ భామ దియా మీర్జా 2019లో తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరి 2021లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీని వివాహం చేసుకుంది. ఒకటిన్నర నెలల తర్వాత ఆమె గర్భం దాల్చినట్లు ప్రకటించింది. గర్భవతి కాబట్టే పెళ్లి చేసుకుందని అప్పట్లో దియాపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.

13. నటాసా స్టాంకోవిక్:

బాలీవుడ్ నటి నటాసా భారతీయ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో ప్రేమలో పడింది. కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన ఈ జంట.. 2020 జనవరి 1న వివాహం చేసుకున్నారు. అయితే 7 నెలలకే, అంటే జూలై 29న మగబిడ్డకు జన్మనిచ్చారు. 

14. మోనా అంబేగావ్కర్:

 హిందీ టీవీ నటి మోనా అంబేగావ్కర్ పెళ్లి చేసుకోకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. బీ టౌన్ లో ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం CID నటుడు దయానంద్ శెట్టి ఆ బిడ్డకు తండ్రి అని తెలుస్తోంది.

15. నేహా ధూపియా:

నేహా తన ప్రియుడు అంగద్ బేడీని 2018 మే నెలలో పెళ్లి చేసుకుంది. అయితే నెల రోజుల తరువాత తాను గర్భం దాల్చినట్టు సోషల్ మీడియా వేదికగా నేహా ధూపియా ప్రకటించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. 

16. అలియాభట్:

పెళ్లయిన ఏడు నెలలకే అలియాభట్ తల్లి కావడంపై కూడా కొన్ని సందేహాలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. పెళ్లికి ముందే ఆమె గర్భవతి కావచ్చనే ప్రచారం జరిగింది. అయితే, దీనిపై అలియా ఇటీవలే స్పష్టత ఇచ్చింది. పెళ్లికి ముందు ఓ హాలీవుడ్ మూవీలో నటిస్తున్న సమయంలో తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించి సందేహాలకు తెరదించింది. 

17. పూర్ణ:

'అవును' ఫేమ్ పూర్ణ కూడా పెళ్ళికి ముందే గర్భవతి అయినట్లు సమాచారం. దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ షానిద్ అసిఫ్ అలీని గతేడాది అక్టోబర్ 25న వివాహం చేసుకుంది. అయితే ఆరు నెలలు కూడా నిండకుండానే ఈ ఏప్రిల్ 4న బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె పెళ్లికి ముందే గర్భవతి అయినట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది.

18. ఇలియానా:

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించిన గోవా బ్యూటీ ఇలియానా.. పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. 'త్వరలోనే వస్తుంది. నా లిటిల్ డార్లింగ్ ని కలవడానికి వేచి ఉండలేను' అని ఇల్లీ బేబీ లేటెస్టుగా రెండు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆమె గర్భం దాల్చడానికి కారణం ఎవరని నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేసింది. అతడితో బ్రేకప్ తర్వాత ఈ బ్యూటీ కత్రినా కైఫ్ సోదరుడు స్టెబాస్టిన్ తో రిలేషన్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి త్వరలోనే వీరు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

Published at : 18 Apr 2023 03:18 PM (IST) Tags: Pregnant Before Marriage Ileana Pregnant Ileana D'Cruz Pregnant Actress Pregnant Tollywood Actress Pregnant

సంబంధిత కథనాలు

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

టాప్ స్టోరీస్

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా