Siddharth: రేవంత్ రెడ్డి చెప్పినట్టే చేద్దాం- తన మాటలపై వివరణ ఇచ్చిన హీరో సిద్ధార్థ్
Bharateeyudu 2 Press Meet: ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్‌లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో ఆయన రాత్రికి మరో వీడియో పెట్టారు. తన మాటలను వక్రీకరించారని అన్నారు.
Siddharth At Bharateeyudu 2 Press Meet: సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు చెబితేనో నా బాధ్యత నాకు గుర్తు రాదని నేను ఎప్పుడు బాధ్యతతోనే ఉంటానంటూ హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. డ్రగ్స్‌పై కచ్చితంగా సినిమా వాళ్లు వీడియో చేయాలన్న ప్రతిపాదనపై భారతీయుడు 2 ప్రెస్‌మీట్‌లో అతను ఇలా స్పందించాడు. కాసేపటికి మరో వీడియో రిలీజ్ చేశాడు. తన మాటలను వక్రీకరించారని... ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు పిల్లల భవిష్యత్ మనలాంటి వాళ్లపై కూడా ఆధార పడి ఉంటుందని అందుకే డ్రగ్స్‌కు దూరంగా ఉంచడం అందరి బాధ్యత అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తన ఫుల్ సపోర్టు ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Actor #Siddharth extends his full support to Telangana Chief Minister #RevanthReddy gari Government's initiative against Drugs and to involve the film industry to make a better society with the Government.#ZeroTolerance #Bharateeyudu2 #Indian2#Indian2FromJuly12 pic.twitter.com/iYes11Vc62
— Vamsi Kaka (@vamsikaka) July 8, 2024
గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు.. సినీ పరిశ్రమపై ప్రత్యక్షంగా ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. ప్రభుత్వాలు మారుతున్నకొద్దీ ఏదో ఒక విధంగా సినీ పరిశ్రమపై ప్రభావం పడుతూనే ఉంది. అదే విధంగా తెలంగాణలో ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఇండస్ట్రీలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలని ఆయన అనుకున్నారు. అందుకే పాన్ ఇండియా చిత్రాలకు టికెట్ రేట్లు పెరగాలంటే ఆ సినిమాలో పనిచేసిన యాక్టర్లు.. ఏదో ఒక సోషల్ మెసేజ్‌ను రికార్డ్ చేసి విడుదల చేయాలని ఆయన అన్నారు. దీనిపై తాజాగా ‘భారతీయుడు 2’ తెలుగు ప్రెస్ మీట్‌లో హీరో సిద్ధార్థ్ స్పందించాడు.
మొదటి తెలుగు హీరోని..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన కొత్త రూల్ గురించి మాట్లాడుతూ యాక్టర్లుగా మీకు సామాజిక బాధ్యత ఉందా అంటూ ‘భారతీయుడు 2’ ప్రెస్ మీట్‌లో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ఆ ప్రశ్న నచ్చని సిద్ధార్థ్.. సీరియస్‌గా రిప్లై ఇచ్చాడు. ‘‘నా పేరు సిద్ధార్థ్. గత 20 ఏళ్లుగా నేను తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మొదటిసారి ఒక తెలుగు సినిమా తరపున కండోమ్ చేతిలో పట్టుకొని ప్లీజ్ కండోమ్ వాడండి అని చెప్తూ పెద్ద బిల్‌బోర్డ్స్‌పై నా మొహం కనిపించేలా నేను ప్రభుత్వంతో సహకరించాను’’ అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు సిద్ధార్థ్. అలాంటి అవగాహనలో పాల్గొన్న మొదటి హీరో తానే అని చెప్పుకొచ్చాడు.
నో కామెంట్స్..
‘‘2005 నుంచి 2011 వరకు ఎక్కడ మీకు సేఫ్ సె* అనే బోర్డింగ్ కనిపించినా సిద్ధార్థ్ అనే వ్యక్తి చేతిలో కండోమ్ ఉండేది. అలా చేయడం నా బాధ్యత. ఒక ముఖ్యమంత్రి చెప్పారని ఆ బాధ్యత నాకు రాదు. ఒక యాక్టర్‌కు బాధ్యత ఉందా అనే ప్రశ్నకు నేను నో కామెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఆ ప్రశ్నే నాకు అర్థం కాలేదు. ప్రతీ యాక్టర్‌కు సామాజిక బాధ్యత ఉంటుంది. మాకు ఉన్నంత తెలివిలో మేము పనిచేస్తుంటాం. ఏ ముఖ్యమంత్రి అయినా మమ్మల్ని ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆ పని మేము చేస్తాం. కానీ ఏ సీఎం కూడా మాతో అలా చెప్పలేదు’’ అని క్లారిటీ ఇచ్చాడు సిద్ధార్థ్. అంతే కాకుండా ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వద్దని రకుల్‌ను, కమల్ హాసన్‌ను కోరాడు సిద్ధు.
సెకండ్ హీరోగా..
కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న సిద్ధార్థ్.. మళ్లీ యాక్టివ్ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగానే శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’లో సెకండ్ హీరోగా నటించాడు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందుల మధ్య షూటింగ్ పూర్తి చేసుకొని, ఎన్నోసార్లు వాయిదాలు పడిన ‘భారతీయుడు 2’.. ఫైనల్ జులై 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ అంతా యాక్టివ్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. అలా తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కూడా జరిగింది.
Also Read: రూ.1000 కోట్ల కలెక్షన్స్‌కు చేరువలో ‘కల్కి 2898 ఏడీ’ - ఇప్పటివరకు ఎంత వచ్చిందో తెలుసా?