అన్వేషించండి
Advertisement
Adhira Movie Teaser & 1st Look: 'అధీరా' - హీరోగా 'ఆర్ఆర్ఆర్' నిర్మాత కుమారుడి సినిమారా!
RRR movie producer DVV Danayya's Son Kalyan Dasari Debut movie first look and Teaser released: 'ఆర్ఆర్ఆర్' నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'అధీరా'.
Kalyan Dasari: ప్రముఖ నిర్మాత, 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా నిర్మించిన నిర్మాత డి.వి.వి. దానయ్య. ఆయన తన కుమారుడు కల్యాణ్ దాసరిని పాన్ ఇండియా సినిమాతో కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ రోజు ఆ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేశారు.
కల్యాణ్ దాసరి కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'అధీరా' (Adhira Movie). ఈ చిత్రానికి 'ఆ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఆయనకూ ఇది తొలి పాన్ ఇండియా సినిమా. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు.
కల్యాణ్ దాసరిని కథానాయకుడిగా పరిచయం చేయడం కోసం కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు డీవీవీ దానయ్య. ప్రశాంత్ వర్మ కంటే ముందు కొంత మంది పేర్లు వినిపించాయి. పలు కథలు విన్నారు. అయితే... సూపర్ హీరో క్యారెక్టరైజేషన్, సైన్స్ ఫిక్షన్ కథతో ప్రశాంత్ వర్మ మెప్పించారు. ఆయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కూడా నచ్చడంతో దానయ్య ఓకే చెప్పారట.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
గాసిప్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion