అన్వేషించండి

Naa Saami Ranga Movie: యాక్షన్ సీక్వెన్స్‌తో ‘నా సామిరంగ’ షూటింగ్ షురూ, జస్ట్ 60 రోజులేనట!

అక్కినేని నాగార్జున, విజయ్‌ బిన్నీ కాంబోలో ‘నా సామిరంగ’ అనే సినిమా రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షురూ అయ్యింది.

'ది ఘోస్ట్' సినిమా ప్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నాగార్జున, రీసెంట్ గా తన బర్త్ డే సందర్భంగా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు  కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించబోతున్నట్లు వెల్లడించారు. ‘నా సామిరంగ’ అనే పేరుతో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలిపారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యింది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని నాగార్జన భావిస్తున్నారట.  

మలయాళ మూవీ ఆధారంగా తెరకెక్కుతున్న ‘నా సామిరంగ’

మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న 'పోరింజు మారియం జోసే' అనే సినిమా ఆధారంగా ‘నా సామిరంగ’ సినిమాను తెరకెక్కిస్తున్నారట. మూలకథ మారకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కథలో మార్పులు చేస్తున్నారట. తాజాగా  ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో మొదలయ్యింది. తొలుత ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించారట. స్టంట్‌ మాస్టర్ వెంకట్‌ ఈ యాక్షన్‌ సీన్లను డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసేలా మేకర్స్ ప్లాన్

ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట మేకర్స్. నాగార్జున గత కొంతకాలంగా సంక్రాంతి బరిలో నిలస్తూ, చక్కటి విజయాలను అందుకుంటున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘బంగార్రాజు’లాంటి సినిమాలు కూడా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేయడంతో పాటు సంక్రాంతి బరిలో దించి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు 'నా సామిరంగ'ను కూడా వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాతో విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారట.  ప్రస్తుతం నాగార్జున లిస్టులో మరికొన్ని కథలు ఉన్నా, ఈ సినిమాను ముందుగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట.   ఎక్కువలో ఎక్కువ  రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలి అనుకుంటున్నారట దర్శకుడు బిన్నీ. ‘ది ఘోస్ట్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాగార్జున, ఈ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నారట.        

ఆకట్టుకున్న ఫస్ట్ లుక్, గ్లింప్స్

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున ఊర మాస్ లుక్ లో కనిపించారు. పగిలిన బల్డ్ ఫిలమెంట్ తో బీడీ కాల్చుకుంటూ రఫ్ లుక్ తో దర్శనం ఇచ్చాడు. ఈసారి పండక్కి ‘నా సామిరంగ’ అంటూ గర్జిస్తాడు.  ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా ఓకే అయినట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చే ఏడాది(2024) సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. 

Read Also: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget