అన్వేషించండి

Sitara : అమ్మానాన్న కాకుండా ఆ ఇద్దరు హీరోయిన్స్‌ అంటే ఇష్టం - ఖలేజా మూవీలోని ఆ పాత్ర చేయాలని ఉంది, సితార కామెంట్స్

Sitara Interview: మహేష్‌ బాబు కూతురు సితార ఘట్టమనేని తాజా ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు ఇండస్ట్రీలో ఆ ఇద్దరు హీరోయిన్లు అంటే ఇష్టమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Sitara Ghattamaneni Interview With influencers: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, నమత్ర శిరొద్కర్‌ల ముద్దుల తనయ సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండిస్ట్రీలోకి రాకముందే ఎంతో మంది మంచి ఫ్యాన్‌ బేస్‌ని సంపాదించుకుంది. అంతేకాదు చిన్న వయసులోనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌, ప్రముఖ జువెల్లరీ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. ఇక తరచూ తన ఫోటోలు, డ్యాన్స్‌, వెకేషన్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. మహేష్‌ బాబు కూతురిగా కంటే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌ గుర్తింపు పొందిన సితార తాజాగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్స్‌ర్‌తో ముచ్చటించింది.

చాన్స్ వస్తే నాన్న సినిమాలోని ఆ పాత్ర చేస్తా

ఈ స్పెషల్‌ చిట్‌ చాట్‌లో సితార పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే ఇన్‌ఫ్లూయేన్స్‌ర్స్‌ అడిగా ప్రశ్నలన్నింటికీ కూల్‌గా సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా సితారకు తన తండ్రి మహేష్‌ నటించిన సినిమాలు, ఆయన చేసిన పాత్రలో ఏవి ఇష్టం.. నటించాల్సి వస్తే ఏది సెలక్ట్‌ చేసుకుంటారనే ప్రశ్న ఎదురైంది. దీనికి సితార స్పందిస్తూ ఖలేజా సినిమాలో ఆయన చేసిన శివరామరాజు పాత్ర చేస్తానంటూ బదులిచ్చింది. అనంతరం తన తండ్రి, తల్లి కాకుండ ఇండస్ట్రీలో ఏ నటీనటులు అంటే ఇష్టమని అడగ్గా.. రష్మిక మందన్నా, శ్రీలీల అని చెప్పింది. అలాగే తన అన్నయ్య గౌతమ్‌ ఘట్టమనేని ఏదైనా తనకు హాని కలిగే విషయాలైతే అవి చేయకూడదని వారిస్తాడని, కానీ అల్లరి మాత్రం ఎక్కువ చేస్తాడని పేర్కొంది.

అన్నయ్య నాకంటే ఎక్కువ అల్లరి చేస్తాడు

ఒక్కొక్కొసారి తన అన్నయ్య అల్లరి చూస్తే ఆయన నిజంగానే నాకంటే పెద్దవాడేనే? అనే ఆశ్చర్యం వేస్తుందంటూ చెప్పుకొచ్చింది. ఆడిపిల్లలకి, చిన్నపిల్లలకు చదువు చాలా ఇంపార్టెంట్‌ అని అర్థమైంది. ఎందుకంటే నాకు చదవడం అంటే చాలా ఇష్టం అందుకే మిగతా పిల్లలు కూడా చదవాలనే ఉద్దేశంతోనే నేను కూడా చారిటీకి డబ్బులు డోనేట్‌ చేశానని చెప్పింది. అన్ని విషయాల్లో తన తల్లిదండ్రులే తనకు స్ఫూర్తి అని చెప్పింది. ఇక తల్లి నుంచి ఫ్యాషన్‌ సెన్స్‌ ఇష్టమని, తన తండ్రి మహేష్‌ యాక్టింగ్‌ స్కిల్స్‌ ఇష్టమని తెలిపింది. ఇక ఇంత చిన్న వయసులో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్స్‌ర్‌ అవ్వడమనేది ఎంతవరకు కరెక్ట్, దీనికి ఏదైనా వయసు అనేది ఉండాలని మీరు అనుకుంటున్నారా? అని అడగ్గా.. అదేం లేదని, చిన్న వయసులోనే ఇన్‌ప్లూయేన్స్‌ర్‌ అవ్వడమనేది చాలా మంచి విషయమంది.

Also Read: హీరోయిన్‌ కాదని దెయ్యాన్ని ప్రేమించిన హీరో, ఇంతకి ఎవరా దివ్యవతి - ఆసక్తి పెంచుతున్న లవ్ మీ రిలీజ్‌ ట్రైలర్‌

ఎందుకుంటే చిన్న వయసులోనే ఎంతో మంది స్ఫూర్తిగా నిలవడమనేది గొప్ప విషయమంటూ సితార చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం తాను ఆరవ తరగతి చదువుతున్నానని, నెక్ట్స్‌ ఏడవ తరగతికి వెళ్తున్నట్టు చెప్పింది. ఇక చదువు అంటే ఇష్టమని చెప్పిన సితార గోల్‌ ఏంటనే ప్రశ్న ఎదురైంది. తన యాక్టింగ్‌ అంటే చాలా ఇష్టమని, తాను తప్పకుండ యాక్టర్‌ అవుతానంటూ చెప్పుకొచ్చింది. కాగా సోషల్‌ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సితార ఓ జువెల్లరి కంపెనీకి సంబంధించిన కమర్షియల్‌ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆమె కోటి రూపాయల పారితోషికం అందుకుంది. ఆ మొత్తాన్ని చారిటికి డోనేట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget