By: ABP Desam | Updated at : 05 Sep 2023 04:13 PM (IST)
Photo Credit : Bhumi Pednekar/Instagram
బాలీవుడ్ లో డిఫరెంట్ రోల్స్ తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది భూమి పెడ్నేకర్. 'దమ్ లగాకే హైసా' అనే మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భూమి పెడ్నేకర్, మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో భూమి పెడ్నేకర్ లావుగా కనిపించి అందరిని షాక్ కి గురి చేసింది. సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తర్వాత పలు సినిమాల్లో విభిన్న తరహా పాత్రలు చేసి మెప్పించింది. కాగా ప్రస్తుతం భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో 'థాంక్యూ ఫర్ కమింగ్'(Thank You For Coming) అనే సినిమా తెరకెక్కుతోంది. రైజ్జ్, రెబల్, రిపీట్ అనేది టాగ్ లైన్.
రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ ని విడుదల చేయగా, ఆ పోస్టర్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది.' థాంక్యూ ఫర్ కమింగ్' ట్రైలర్ ని సెప్టెంబర్ 6 న 1: 50 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు భూమి పెడ్నేకర్ తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్టర్ని అభిమానులతో పంచుకుంటూ, 'సెప్టెంబర్ 6న ట్రైలర్ విడుదలవుతుందని, మర్చిపోకుండా ట్రైలర్ ని చూడండి' అంటూ పోస్ట్ పెట్టింది. ఇక ట్రైలర్ రిలీజ్ పోస్టర్ లో భూమి పెడ్నేకర్ బోల్డ్ లుక్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.
బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఏక్తా కపూర్, శోభ కపూర్, రియా కపూర్, అనిల్ కపూర్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రియా కపూర్ భర్త కరణ్ బులాని ఈ సినిమాతో బాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమాలో భూమి పెడ్నేకర్ తో పాటు షహనాజ్ గిల్, అనిల్ కపూర్, కుషా కపిల, నటాషా రస్తోగి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఏక్తా కపూర్, రియా కపూర్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన లేడీ ఓరియంటెడ్ మూవీ 'వీరేది వెడ్డింగ్' సినిమా తరహాలో ఓల్డ్ ఏజ్ కామెడీ మూవీ గా 'థాంక్యూ ఫర్ కమింగ్' సినిమా ఉండనునట్లు తెలుస్తోంది.
మరోవైపు విడుదలకు ముందే ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. ఈ మూవీని టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (TIFF) 2023 లో ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడుతున్న ఏకైక హిందీ చిత్రంగా 'థాంక్యూ ఫర్ కమింగ్' మూవీ నిలిచింది. సెప్టెంబర్ 15, 2023 రాయ్ థామ్సన్ హోటల్లో నిర్వహిస్తున్న టోరెంట్ ఇంటర్నేషనల్ ఫిలిం సెట్స్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
ఇక భూమి పెడ్నేకర్ విషయానికి వస్తే.. ఈ హీరోయిన్ చివరగా విక్కీ కౌశల్ సరసన 'గోవిందా నామ్ మేరా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ కొంత గ్యాప్ తర్వాత 'థాంక్యూ ఫర్ కమింగ్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది భూమి పెడ్నేకర్. మరి ఈ సినిమాతో భూమి ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.
Also Read : హీరోయిన్ మృతికి ఆమె భర్తే కారణమా? మద్యానికి బానిసైన భర్త వేధింపుల వల్లే...
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్
‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Tiger Nageswara Rao Movie : రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
/body>