Aamir Khan: 'దంగల్' నటి మృతి - స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించిన ఆమిర్ ఖాన్
Aamir Khan: సుహానీ ఇంటికి వెళ్లిన ఆమిర్ ఖాన్ ఆమె తల్లిదండ్రులను పరామర్శించి కాసేపు వారితో మాట్లాడాడు. అనంతరం సుహానీ చిత్ర పటం వద్ద ఆమెకు సంతాపం తెలిపాడు.
amir Khan Visit To Dangal Actress Suhani Bhatnagar House: బ్లాక్‌బస్టర్ మూవీ 'దంగల్' చైల్డ్ ఆర్టిస్ట్, బాలీవుడ్ నటి సుహానీ భట్నాగర్ మ్రతి ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 'దంగల్' మూవీతో ఆమిర్ ఖాన్ కూతురిగా బబితా ఫోగట్ పాత్రలో ఆకట్టుకుంది. అయితే గతంలో ఓ ప్రమాదంలో గాయపడిన ఆమె చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఫిబ్రవరి17న కన్నుమూసిన సంగతి తెలిసిందే. 19 ఏళ్ల సుహాని మరణావార్తతో బాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలోకి వెళ్లింది. 'దంగల్'లో తన కూతురిగా నటించిన సుహానీ మరణంపై ఆమిర్ ఖాన్ దిగ్భ్రాంతికి గురయ్యారు.ఆమె మరణవార్త తెలిసి షాకాయ్యానని, ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె జీవితం ఇలా ప్రారంభంలోనే ఆగిపోతుందనుకోలేదంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యాడు.
ఆమె మరణించి ఆరు రోజులు అవుతుంది. ఈ క్రమంతో తాజాగా ఆమిర్ సుహానీ ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను పరామర్శించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఢిల్లీలోని సుహానీ ఇంటికి వెళ్లిన ఆమిర్ ఖాన్ ఆమె తల్లిదండ్రులను పరామర్శించి కాసేపు వారితో మాట్లాడాడు. అనంతరం సుహానీ చిత్ర పటం వద్ద ఆమెకు సంతాపం తెలిపాడు. ఈ సందర్భంగా సుహానీ తల్లిదండ్రులతో కలిసి ఆమె చిత్రపటం వద్ద ఫోటో దిగారు. ప్రస్తుత ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసి అమిర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఒక చిన్న నటి, చేసింది ఒకటే సినిమా అయినా ఆమె కోసం ఆమిర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. నిజంగానే ఆమిర్ 'మిస్టర్ పర్ఫెక్ట్' అంటూ నెటిజన్లు ఆయనను కొనియాడుతున్నారు.
Also Read: సుందరం మాస్టర్ రివ్యూ : హర్ష చెముడు సినిమా హిట్టా? ఫట్టా?
కాగా శరీరమంత నీరు పట్టడం వల్లే సుహానీ మృతి చెందినట్టు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. కొంత కాలం క్రితం సుహానీకి యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ఆమె కాలు విరిగిపోయింది. కాలు ఫ్యాక్చర్‌కి చికిత్స పొందుతున్న ఆమెపై మెడిసిన్ దుష్ప్రభావం చూపించాయి. దీంతో ఆమె శరీరమంత నీరు పేరుగుపోవడం మొదలైంది. దీంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చెర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె ఫబ్రవరి 17న ఆరోగ్యం క్షిణించడంతో తుదిశ్వాస విడిచింది.
అమీర్ ఖాన్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ 'దంగల్'(2016)లో బబితా ఫోగట్ పాత్రలో నటించి ప్రేక్షకులు హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసల దక్కాయి. అలాగే సుహానీ సినిమాలతో పాటు పలు టెలివిజన్ వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించింది. అయితే దంగల్ తర్వాత చాలా సినిమాల నుంచి ఆఫర్లు వచినా నటకు బ్రేక్ ఇచ్చి పై స్టడిస్‌పై ద్రష్టి పెట్టాలనుకుంది. అందుకే దంగల్ తర్వాత ఆమె మరే సినిమాల్లోనూ కనిపించలేదు. చదువును పూర్తి చేసిన తర్వాతే తిరిగి సినిమాల్లో నటిస్తానని దంగల్ టైంలో పలు ఇంటర్య్వూల్లో వెల్లడింది.