News
News
వీడియోలు ఆటలు
X

Bigg Boss 5 Telugu Episode 102 Update: అతడి హెల్ప్.. సోప్ వేయడానికే.. సిరికి బ్రహ్మ హితబోధ!

బిగ్ బాస్ 102వ ఎపిసోడ్‌లో సోమవారం చోటుచేసుకున్న ఆసక్తికర పరిణామాలు ఇలా ఉన్నాయి.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సీజన్ 5.. 102వ ఎపిసోడ్‌లో.. సన్నీ తన ఎమోషనల్ జర్నీ గురించి చెప్పాడు. బిగ్ బాస్ ఇచ్చిన కేకును తెచ్చి మిగతా హౌస్‌మేట్స్‌తో పంచుకున్నాడు. అనంతరం తన జర్నీ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యానని తెలిపాడు. సిరి అయితే అది చూసి తట్టుకోలేదని అన్నాడు. అనంతరం దాగుడు మూతల ఆట ఆడుకున్నాడు. ఐదుగురు సోఫాల వెనుక, కిచెన్ వెనుక దాక్కుంటూ కాసేపు నవ్వించారు. అనంతరం సన్నీ.. గత కొన్ని వారాలుగా నిర్వహించిన టాస్కులను, ఇంటి సభ్యులను గుర్తు తెచ్చుకుంటూ ఫన్ క్రియేట్ చేశాడు. 

సన్నీ, మానస్‌లు చిన్న పిల్లలు ఆట ఆడుకున్నారు. ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ.. శ్రీరామ్ ఆట తనకు నచ్చదని తెలిపాడు. శ్రీరామ్ అన్నీ ఆలోచించి ఆడతాడని తెలిపాడు. ఆ తర్వాత సిరీకి తన జర్నీ చూసే అవకాశం లభించింది. తన ఫొటోలను చూసుకుని మురిసిపోయింది. ఈ జీవితంలో ఐస్ టాస్క్‌ను మరిచిపోలేనని సిరి పేర్కొంది. ఒడియమ్మా అంటూ.. అరుపులు.. కేకలతో కాసేపు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపించింది. అయితే, ఆమె తన ఆనందాన్ని ఆ విధంగా వ్యక్తం చేసిందనుకోవచ్చు. 

‘‘సిరి.. బిగ్ బాస్ ఇంట్లో అందరి కంటే ముందుగా ప్రయాణం మొదలుపెట్టారు. అల్లరి పిల్లగా.. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుండే సిరిగా మీరు అందరికీ పరిచయం. మీకు మీరుగా సిరి అంటే ఏమిటో ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్‌గా మొదలైన ప్రయాణం.. ఎన్నో మలుపులు తిరిగింది. మీ పోటీదారులు మీ కంటే బలంగా ఉన్నా.. గివ్ అప్ ఇవ్వకుండా మీ తెలివి తేటలు, ధైర్యంతో చివరి వరకు ఉండటానికి చేసిన ప్రయత్నం ఎందరినో మెప్పించింది. కానీ, ఎన్నోసార్లు.. ఎమోషనల్‌తో కన్నీరు పెట్టుకున్నారు. మీ నవ్వుల మధ్య మీ కన్నీళ్లు కనుమరుగయ్యాయి. పిట్ట కొంచెం కూత ఘనం అనే మాట మీ విషయంలో నిజమని అందరికీ నిరూపించారు. సిరి మీ అల్లరి బిగ్ బాస్ ఇంటికే కళను తీసుకొచ్చింది. ఈ ఇంట్లో మీకు దగ్గరైన బంధాలు మీ మనసుకు ఎప్పటికీ దగ్గరగానే ఉంటాయనేది మీరు పోరాడే తీరు తెలియజేస్తుంది’’ అని బిగ్ బాస్ తెలిపాడు. ఆ తర్వాత సిరి జర్నీని చూపించాడు. సిరి దాన్ని చూస్తూనే ఎమోషనల్‌కు గురైంది. స్క్రీన్ మీద శ్రీహన్ కనిపించగానే.. కన్నీరుమున్నీరైంది. ఆ తర్వాత మొత్తం ఆరు ఫొటోలను తీసుకెళ్లిపోయింది. అయితే షన్నుతో ఉన్న రొమాంటిక్ ఫొటోను టేబుల్ మ్యాట్ కింద దాచి పెట్టింది. షన్నును సర్‌ప్రైజ్ చేద్దామని టేబుల్ మ్యాట్ కింద దాచిన చిత్రాన్ని బిగ్ బాస్ తీసుకెళ్లిపోయాడు.

సిరి, షన్ను మాట్లాడుకుంటూ.. ‘‘నీకు తండ్రి లేడని నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు. మీ మమ్మీకి చెప్పు’’ అని వచ్చిందని చెప్పగానే షన్ను నోరు మూసుకుని.. ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మానస్ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడు మనకు చెబుతున్నాడు కంటెంట్ గురించి’’ అని షన్ను అన్నాడు. ఆ ప్రశ్న ఎవరికి వచ్చింది? అని సిరి అడిగితే.. ‘‘మనోడికే వచ్చింది’’ అని షన్ను అన్నాడు. ‘‘అతడు చేసేది.. మనం చేసేది ఒకటే అనుకుంటున్నాడు. అది తప్పు మాట. హెల్ప్‌లు చేయడాలన్నీ సోప్ వేయడాలు. అవన్నీ మనల్ని పడేయడానికే. అతడు చాలా హెల్ప్ చేస్తాడు. వీళ్లంతా అతడిని తప్పుగా అనుకుంటారని జనాలు అనుకోవాలని చేస్తారు. అందుకే నేను వారికి అవకాశం ఇవ్వను. నువ్వు ఎందుకు ఇస్తావ్ అనేది నా పాయింట్’’ అని సిరిని అన్నాడు. 

ఆ తర్వాత బిగ్ బాస్.. హౌస్ మేట్స్ తాము ఎంపిక చేసుకున్న ఫొటోల గురించి చెప్పాలని కోరాడు. ఈ సందర్భంగా మానస్.. ‘‘టెడ్డీబేర్‌ టాస్కులో గెలిచాక నేను, యానీ మాస్టర్‌, సన్నీ గెలిచాక సంతోషంతో హగ్గిచ్చుకున్నాం’’ అంటూ ఆ ఫొటో వెనకాల స్టోరీని చెప్పుకొచ్చాడు. షన్ను మాట్లాడుతూ.. ‘‘జర్నీ మొత్తంలో బాగా బాధపడిన క్షణాలేవైనా ఉన్నాయంటే.. అది అది అమ్మ రాసిన లెటర్‌ కళ్ల ముందే ముక్కలవడమని తెలిపాడు. సిరి మాట్లాడుతూ.. ‘‘బ్రిక్స్‌ ఛాలెంజ్‌ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని తెలిపింది. ఆ టాస్క్‌కు ముందే షన్నును ఫేక్‌ ఫ్రెండ్‌ అన్నానని.. అది తప్పని బ్రిక్స్‌ ఛాలెంజ్‌ టాస్క్‌లో నిరూపించాడని తెలిపింది. శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘‘నేనెప్పుడూ చెప్పలేదు కానీ.. హమీదాను చాలా మిస్సవుతున్నా’’ అని తెలిపాడు. ఆమే ఉండుంటే లోన్‌ రేంజర్‌ అనే పేరు వచ్చేది కాదు, ఈ జర్నీలో ఆమెను మిస్సయ్యాను’’ అని తెలిపాడు. రేపు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులంతా సైకిల్ పంపుతో బెలున్లూ పగలగొట్టే టాస్క్ ఆడనున్నారు. 

Published at : 15 Dec 2021 10:35 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Shanmukh jaswanth బిగ్ బాస్ 5 తెలుగు manas Siri బిగ్ బాస్ 5 VJ Sunny సిరి షన్ముఖ్ జస్వంత్ Sri Rama Chandra వీజే సన్నీ

సంబంధిత కథనాలు

Boyapati RAPO Movie : శ్రీ లీలతో కలిసి మైసూర్ వెళ్ళిన రామ్ పోతినేని - అసలు మ్యాటర్ ఏంటంటే?

Boyapati RAPO Movie : శ్రీ లీలతో కలిసి మైసూర్ వెళ్ళిన రామ్ పోతినేని - అసలు మ్యాటర్ ఏంటంటే?

Gruhalakshmi June 6th: రాజ్యలక్ష్మి ప్లాన్ సక్సెస్, దివ్యని అసహ్యించుకున్న విక్రమ్- రంగంలోకి లాస్య మాజీ మొగుడు

Gruhalakshmi June 6th: రాజ్యలక్ష్మి ప్లాన్ సక్సెస్, దివ్యని అసహ్యించుకున్న విక్రమ్- రంగంలోకి లాస్య మాజీ మొగుడు

Bro Special Song Cost : ఏంటిది పవన్ 'బ్రో' - ఊర్వశి స్పెషల్ సాంగ్‌కు అంత ఖర్చా?

Bro Special Song Cost : ఏంటిది పవన్ 'బ్రో' - ఊర్వశి స్పెషల్ సాంగ్‌కు అంత ఖర్చా?

RRR Re-Release Trailer: ‘RRR’ మరో ఘనత, గోల్డెన్ ట్రైలర్ అవార్డుకు రీ-రిలీజ్ ట్రైలర్ నామినేట్!

RRR Re-Release Trailer: ‘RRR’ మరో ఘనత,  గోల్డెన్ ట్రైలర్ అవార్డుకు రీ-రిలీజ్ ట్రైలర్ నామినేట్!

Krishna Mukunda Murari June 6th: కొడుకు, కోడలు విడిపోకుండా అదిరిపోయే ప్లాన్ వేసిన రేవతి- ముకుందకి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్

Krishna Mukunda Murari June 6th: కొడుకు, కోడలు విడిపోకుండా అదిరిపోయే ప్లాన్ వేసిన రేవతి- ముకుందకి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్

టాప్ స్టోరీస్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్‌

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్‌ ఎంత పెరగొచ్చు?

WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్‌ ఎందులో? టైమింగ్‌, వెన్యూ ఏంటి?

WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్‌ ఎందులో? టైమింగ్‌, వెన్యూ ఏంటి?

Adani Group: అప్పు తీర్చిన అదానీ, షేర్‌ ప్రైస్‌లో స్మార్ట్‌ రియాక్షన్‌

Adani Group: అప్పు తీర్చిన అదానీ, షేర్‌ ప్రైస్‌లో స్మార్ట్‌ రియాక్షన్‌