NBK107: టర్కీకి బాలయ్య ప్రయాణం - కొన్నిరోజుల పాటు అక్కడే!
ఇటీవల కరోనా నుంచి కోలుకున్న బాలయ్య వెంటనే #NBK107 షూటింగ్ లో పాల్గొన్నారు.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను, టీజర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య మాస్ అవతార్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఇటీవల కరోనా నుంచి కోలుకున్న బాలయ్య వెంటనే #NBK107 షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కొంత భాగం అమెరికాలో చిత్రీకరించాలనుకున్నారు. కానీ వీసా ఫార్మాలిటీస్ ఆలస్యమవుతుండడంతో షూటింగ్ ని టర్కీకి షిఫ్ట్ చేశారు. రీసెంట్ గా చిత్రబృందం టర్కీకి వెళ్లి లొకేషన్స్ ను ఫైనల్ చేసుకొని వచ్చింది.
ఆగస్టులో టీమ్ తో కలిసి బాలకృష్ణ టర్కీకి పయనమవనున్నారు. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు నిర్మాతలు.
ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఇందులో బాలయ్య తన వయసుకి తగ్గ పాత్రలో కనిపిస్తారని సమాచారం. కథ ప్రకారం.. ఆయనకొక కూతురు కూడా ఉంటుందట. ఆ పాత్రలో హీరోయిన్ శ్రీలీల కనిపించబోతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
Also Read :టాలీవుడ్‌లో విషాదం - ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
Also Read : కీరవాణి తప్పు చేశారా? బూతు ట్వీట్ డిలీట్ చేసినా...
View this post on Instagram