అన్వేషించండి

N Convention: అప్పుడు ఏఎన్నార్, ఇప్పుడు నాగార్జున - ప్రాపర్టీ వివాదాలపై అక్కినేని ఫ్యామిలీ ఫైట్ !

Nagarjuna N Convention | మాదాపూర్ లోని తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం పట్ల నటుడు నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కేసు ఉండగానే కూల్చివేయడం ఏంటని మండిపడ్డారు.

N Convention Demolition: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా (HYDRAA) టీమ్ కూల్చివేయడం సంచలనంగా మారింది. మాదాపూర్ లో ఉన్న ఈ నిర్మాణాన్ని భారీ పోలీసు బందోబస్తు నడుమ అధికారులు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. తుమ్మిడి చెరువులోని సుమారు మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఈ కన్వెషన్స్ ను చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేసింది. హైడ్రా అధికారులు, జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి ఆ నిర్మాణాన్ని కూల్చివేశారు. నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా.. స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున ఆగ్రహం

హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేడయం పట్ల నటుడు నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాతో పాటు రేవంత్ సర్కారు తీరును తప్పుబడుతూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. చట్టవిరుద్ధంగా తన కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసిన అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటానన్నారు. కోర్టు కేసులు,స్టే ఆర్టర్లను పట్టించుకోకుండా ఎన్ కన్వెన్షన్‌ ను కూల్చి వేయడం బాధాకరం అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి తాను ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదన్నారు.

పక్కా పట్టా భూమిలో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు చెప్పారు. ఒక్క ఇంచుకూడా చెరువు భూమిని ఆక్రమించి కట్టలేదన్నారు. గతంలో ఎన్ కన్వెన్షన్ ను కూల్చి వేయాలంటూ ఇచ్చిన నోటీసు మీద కోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసే ముందు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. కేసు కోర్టులో ఉండగా ఇలా కూల్చివేయడం సరికాదన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని చెప్పారు. కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, తానే ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయించే వాడినని వెల్లడించారు.   

అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోస్ కు ఎన్టీఆర్ నోటీసులు

అన్నపూర్ణ స్టూడియోస్ విషయంలో ఎన్టీఆర్ తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు గతంలో వెల్లడించారు. నేడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో గతంలో అన్నపూర్ణ స్టూడియో కోసం ఏఎన్నార్ పోరాడి విజయం సాధించారని ఆయన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ కోసం కేటాయించిన భూమిని, ఏఎన్నార్ వ్యాపారం కోసం వాడుకున్నారనే ఆరోపణలతో 5 ఎకరాల స్థలాన్ని వెనక్కితీసుకోవాలని అధికారులు నోటీసు ఇచ్చారు. అప్పటి సీఎం ఎన్టీఆర్ నిర్ణయం పట్ల అక్కినేని షాక్ అయ్యారు. చట్టపరంగా హక్కులు ఉన్న అన్నపూర్ణ స్టూడియోపై తన సహ నటుడు ఎన్టీఆర్ సర్కార్ నుంచి నోటీసులు అందుకోవడం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఎన్నార్ కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ కోర్టు నాగేశ్వరరావుకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది.

ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి రావడంతో తన స్టూడియోకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. ఇతర ముఖ్యంత్రులు కూడా తన స్టూడియో విషయంలో ఎలాంటి కొర్రీలు పెట్టలేదన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం నిర్మించిన ఈ స్టూడియో.. సినీ పరిశ్రమ డెవలప్ మెంట్ కోసమే పాటుపడుతుందని ఏఎన్నార్ వెల్లడించారు.  ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ విషయంలో రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ నాగార్జున కోర్టుకు వెళ్లారు. ఈ కూల్చివేతలను నిలిపివేస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం నాటి ఎన్టీఆర్ ప్రభుత్వ తీరును తలపిస్తోందంటున్నారు నెటిజన్లు.  

Read Also: ఎన్ కన్వెన్షన్‌ అక్రమ నిర్మాణమే, ఎలాంటి అనుమతే లేదు- కూల్చివేతపై Hydra ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget