నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. ఈ సినిమా కోసం తెలుగు ప్రజలందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరుగుతోంది.


ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, గోపీచంద్ మలినేని కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. డిసెంబర్ 2వ తేదీ నుంచి పెద్ద సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయన్నారు. అఖండ సినిమాని మొదటి రోజు థియేటర్లోనే చూస్తానని తెలిపారు.


ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ప్రగ్నా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, జగపతిబాబు కూడా నటించారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం అందించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.


అఖండ్ సెన్సార్ కూడా ఇప్పటికే పూర్తయింది. యూ/ఏ సర్టిఫికెట్‌ను ఈ సినిమా పొందింది. సినిమా రన్ టైం 2 గంటల 47 నిమిషాలుగా ఉండనుంది. కరోనావైరస్ సెకండ్ వేవ్ తర్వాత విడుదల అవుతున్న మొదటి పెద్ద సినిమా కావడంతో దీనికోసం అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినిమా పరిశ్రమ కూడా ఎదురుచూస్తుంది.


ఈ సినిమా విడుదలై విజయం సాధిస్తే.. తర్వాత వచ్చే పెద్ద సినిమాలు భయం లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది.


Also Read:బిగ్ బాస్ ట్విస్ట్.. ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్‌



 


 


Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి