ఉల్లిగడ్డ కోస్తే.. కళ్లకు నీళ్లు రాడవం సహజం. కానీ ఇప్పుడు.. టమోటాలను మార్కెట్ కు వెళ్లి.. తీసుకొచ్చి.. కొయ్యాలంటే.. వంట చేసే వాళ్లకు దు:ఖం వస్తుందనుకోండి. అంతలా పెరిగిపోయాయి ధరలు. వివిధ రాష్ట్రాల్లో అయితే రూ.100 మార్క్ ను ఎప్పుడో దాటేసింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధరలను మించిపోయింది. ఈ ధరలు చూస్తే.. ఒక్కోసారి.. అనిపిస్తుంది కదా. ఇదేంట్రా బాబు.. జీవితం.. ఇక టమోటాలు నేనే పండిచేస్తానని ఎన్నిసార్లు అనుకుని ఉంటారు. అలాంటి వారికోసమే ఇంట్లోనే టమోటాలు పెంచుకోవచ్చు. సరే.. అది అర్జెంట్ గా టమోటాలు ఇవ్వకపోయినా.. ఇలాంటి టైమ్ మళ్లీ వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది కదా. ఇంట్లోనే ఉండేవాళ్లకు ఓ కాలక్షేపం కూడా..



  • తాజా టమోటాను కొన్ని ముక్కలుగా చేసుకోండి.

  • చిన్న చిన్న రంధ్రాలు ఉన్న కుండను ఎంచుకోండి. పైన కొన్ని అంగుళాల వరకు ప్లేస్ వదిలి.. ఆ తర్వాత కుండలో మట్టితో నింపండి. దాదాపు ఏ రకమైన మట్టిలోనైనా.. టమోటా పండుతుంది. బంకమట్టిలోనే పెరగడం కాస్త కష్టం. టామాటా వేర్లు వెళ్లేందుకు అనువుగా కుండలో మట్టి ఉండాలి.

  • అయితే  మార్కెట్ లో దొరికే కొన్ని మందులు కూడా ఉపయోగించుకోవచ్చు. వాటి అవసరం లేకుండా కూడా పెరిగే అవకాశం ఉంది.

  • మీరు కట్ చేసిన టమోటా ముక్కలను మట్టిపై ఉంచండి. ఎక్కువ వస్తాయిగా అని.. ఎక్కువ ముక్కలు పక్కపక్కనే పెట్టకండి పెరగవు. లోతుగా కాకుండా.. తక్కువ మట్టిలోనే పాతిపెట్టాలి. తేలికపాటి మట్టి పొరతో వాటిని కప్పి పెట్టండి.

  • ఆ కుండను బాగా వెంటిలేషన్ ఉండే ప్రదేశంలో పెట్టండి. అది సూర్య రశ్మీ, నీడ రెండు తాగిలేలా ఉండాలి. మట్టిని రోజూ తేమగా ఉంచండి. అలా అని.. ఎక్కువ నీరు పెట్టకూడదు. మెులకలు 10 నుంచి 14 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.

  • మెులకలకి తక్కువ నీరు అవసరం. కాబట్టి స్ర్పే బాటిల్ ను ఉపయోగించండి. ఒకవేళ మెుక్కలను వీలును బట్టి పెద్ద కుండలోకి మార్చవచ్చు.

  • మెుక్కలు పెరగడం ప్రారంభమయ్యాక... కాండానికి సపోర్ట్ గా చెక్క కర్రలను పెట్టండి.. లేకుంటే చెట్టు వంగిపోతుంది.

  • మీరు పెంచిన మెుక్క టమోటాలు కాసేందుకు 60 నుంచి 70 రోజులు పడొచ్చు.  


నాటడానికి ముందు, వ్యవసాయ శాస్త్రవేత్తలు టమోటా విత్తనాలను 12-24 గంటలు ఎరువుల ద్రావణంలో ఉంచమని సలహా ఇస్తారు. టమోటా పంటలో దిగుబడి బాగా రావాలంటే క్యాల్షియం ఎక్కువగా ఉన్న నేలల్లో వాటిని నాటుకోవాలి. కింద మొత్తం మట్టి నింపి వాటిపై ఒక లేయర్ కంపోస్ట్ నింపి మళ్లీ మట్టి పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాయలు పొందే వీలుంటుంది. అంతేకాదు.. స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్స్ దీనికి చేర్చుకోవాల్సి ఉంటుంది. తగిన మొత్తంలో కంపోస్ట్ వాడడం వల్ల మొక్కకు తగిన వేడి కూడా తగిలి కాయలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.


Also Read: Tomato: కృష్ణా జిల్లాలో టమాటా దొంగలు హల్ చల్... పక్కా స్కెచ్ తో చోరీ...


Also Read: Paneer in America: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది... ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా


Also Read: Squid Game: 456 మందితో రియల్ ‘స్క్విడ్ గేమ్’.. విజేతకు రూ.3.41 కోట్లు, ఓడినవాళ్లను ఏం చేశారంటే..


Also Read: Tomato Alternatives: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి