కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో దొంగలు హల్ చల్ చేశారు. ఎంతో విలువైన వాటిని కాజేశారు. వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉందని తెలుసుకున్న దొంగలు... వీటి దొంగతనానికి మాస్టర్ ప్లాన్ వేశారు. పక్కా ప్రణాళికతో సీసీ కెమెరాలకు చిక్కకుండా మాయం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. ఈ చోరీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు దొంగతనం చేసింది ఏమిటో తెలుసా... ఎంతో విలువైన టమాటాలు. టమాటాలా అని ఆశ్చర్యపోకండి నిజంగా టమాటాలనే దొంగతనం చేశారు. కృష్ణా జిల్లాలో టమాటాలు దొంగలు రెచ్చిపోయారు. పెనుగంచిప్రోలు మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి టమాటా దొంగలు హల్ చల్ చేశారు. 4 ట్రేల టమాటాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. ఒక్కో ట్రే టమాటాల ధర రూ.2000 వరకూ ఉంటుందని బాధితులు అంటున్నారు. టమాటా రేటు రూ.100పైనే పలుకుతున్న సమయంలో ఈ ఘటన  చోటుచేసుకోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 


Also Read: సెంచరీ దాటిన టమాటా ధరలు...మరి ప్రత్యామ్నాయంగా ఏం తినాలంటే...


భారీ వర్షాలతో దిగుబడి, రవాణాపై ప్రభావం


తెలుగు రాష్ట్రాలతో సహా తమిళనాడు, కర్ణాటకలో టమాటా రేట్లు పెట్రోల్ ను దాటేశాయి. ఒకానొక సమయంలో కిలో టమాటాల ధర రూ.150లకు చేరింది. దీంతో సామాన్యులు టమాటాలను వాడడమే మానేస్తున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకువేసి రైతు బజార్లలో కిలో టమాటాలను రూ. 60కు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కూరగాయల పంటలన్నీ కొట్టుకుపోయాయి. దీంతో ఈ ప్రభావం ఇతర ప్రాంతాలపై పడింది. టమాటా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా పండుతుంది. ఇటీవల ఆ ప్రాంతాల్లో వరదల రావడం టమాటాల దిగుబడి తగ్గింది. అలాగే మిగిలిన ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం కూడా లేకపోవడంతో టమాటాలు దిగుమతి కాలేదు. దీంతో టమాటా రేట్లు ఆకాశానంటాయి. 


Also Read: అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !


గత ఏడాది కంటే 63% పెరిగిన ధరలు


టమాటా ధర ప్రస్తుతం కిలో రూ.60-70 పలుకుతుంది. ఈ ధరలు గత ఏడాది కంటే 63% అధికమయ్యాయని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెల్పింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాది రాష్ట్రాలకు రవాణా అడ్డంకులు ఏర్పడ్డాయని తెలిపింది. దీంతో సెప్టెంబరు చివరి నుంచి టమాటా ధరలు పెరిగాయని పేర్కొంది. ఉత్తర భారతంతో టమాటా దిగుబడులు డిసెంబర్ లో ప్రారంభం అవుతాయని, అప్పటి నుంచి ధరల తగ్గే అవకాశం ఉంటుందని వివరించింది. 


Also Read:  చల్లని పాలు తాగితే లాభమా లేక వేడి పాలు మంచివా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి