ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో మరో అనుబంధ అఫిడవిట్‌ను హైకోర్టులో సమర్పించింది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ అఫిడవిట్‍కు అనుబంధంగా కొత్తగా తెచ్చిన బిల్లులను కోర్టుకు ఏపీ ప్రభుత్వం సమర్పించింది. ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అందులో ప్రభుత్వం స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, సమగ్ర అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. అందుకు అనుగుణంగా సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకే ఈ బిల్లులు ఉపసంహరించుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
Also Read : జగన్ పాలన ఫెయిల్ - ఏపీలో ప్రజాస్వామ్యం లేనట్లేనన్న ఉండవల్లి అరుణ్ కుమార్ !
చట్టం రద్దు ద్వారా సీఆర్డీఏను పునరుద్ధరించామని..ప్రభుత్వం తెలిపింది. అఫిడవిట్‌లో శ్రీబాగ్ ఒప్పందం గురించి ప్రభుత్వం ప్రస్తావించింది. శుక్రవారమే ప్రభుత్వ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు శాసన సభ, మండలి సమావేశాల్లో ఉప సంహరణ బిల్లులను ఆమోదించినట్లు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రభుత్వం తరుఫున అఫిడవిట్‌ను సమర్పించారు. ఏపీలో రాజధాని అమరావతిని కొనసాగించాలని గత రెండేళ్లుగా రైతులు, ఐక్యకార్యచరణ నాయకులు కోర్టులో పిటిషన్లు వేశారు.
Also Read : త్రివిక్రమ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు
ఈ కేసులను విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం రోజువారీగా విచారిస్తుంది. ఈ కేసుల విచారణ తుది దశకు వస్తున్న తరుణంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తమ బిల్లులను మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 26 వరకు ఇందు కోసం గడువును హైకోర్టు ఇచ్చింది.
Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
26న అఫిడవిట్లు సమర్పించిన ప్రభుత్వం 27న మరో అనుబంధ అఫిడవిట్ సమర్పించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. అనుబంధ అఫివిట్‌లో శ్రీబాగ్ ఒప్పందం వంటివి ప్రస్తావించడంతో న్యాయస్థానంలో వాదనలు కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈ అంశంపై రైతు తరపు న్యాయవాదులు అఫిడవిట్లను అధ్యనం చేస్తున్నారు. వీటిపై సోమవారం హైకోర్టులో వాదనలు సాగే అవకాశం ఉంది.
Also Read: సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !