దర్శక ధీరుడు రాజమౌళి కారణం లేకుండా ఏ పని చేయరు. 'ఆర్ఆర్ఆర్' నుంచి సోల్ యాంథమ్ 'జనని...' విడుదల చేయడం వెనుక బలమైన కారణం ఉంది. సినిమాలో కేవలం పోరాట దృశ్యాలు, యుద్ధాలు మాత్రమే కాకుండా బలమైన భావోద్వేగాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకొంచెం నిశితంగా గమనిస్తే... చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే, కొన్ని ప్రశ్నలు కూడా ఉంటాయి.
ఎర్ర గాజులు...
'జనని...' పాటలో ఇద్దరు హీరోయిన్లు కనిపించారు. రామ్ చరణ్‌కు జంటగా నటించిన ఆలియా భట్, అజయ్ దేవగణ్ భార్య పాత్ర పోషించిన శ్రియ. ఇద్దరి చేతులు గమనిస్తే... సాధారణ మట్టి గాజులు, అవీ ఎర్రటి గాజులు కామన్‌గా కనిపిస్తాయి. ఎరుపు రంగు విప్లవానికి చిహ్నం. తెల్లదొరలపై పోరాటానికి సంకేతంగా అవి ధరించారా? లేదంటే... నార్మల్‌గా వేసుకున్నారా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
ఆ ఇద్దరు పిల్లలు ఎవరు?
'జనని...' పాటలో తొలుత ఓ చిన్నారిని చూపించారు. ఆ తర్వాత మరో బాలుడు తుపాకీ తూటాకు నెలకు ఒరిగినట్టు చూపించారు. ఆ సమయంలో శ్రియ వెనక్కి తిరిగి చూసినట్టు చూపించారు. ఆ పిల్లలు ఇద్దరు ఎవరు? కథలో వాళ్ల పాత్ర ఏమిటి? అనేది ప్రస్తుతానికి ప్రశ్నగా మిగిలింది. 'ఛత్రపతి'లో ఓ బాలుడు కీలక పాత్ర పోషించాడు. 'బాహుబలి'లోనూ పిల్లాడు ఉంటాడు. అలాగే, 'ఆర్ఆర్ఆర్'లో కూడా చిన్నారులు కీలక పాత్రల్లో కనిపించే అవకాశం ఉందన్నమాట.
ఆ చేయి ఎవరిది?
'జనని...' పాటలోని ఓ దృశ్యంలో బ్రిటిష్ పోలీసులు ఒకరిని హత్య చేసినట్టు చూపించారు. మరణించిన వ్యక్తి చేతిలో కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్ మీద 1905 అని ఉంది.
ఎన్టీఆర్ మేడలో పూసల గొలుసు!
మన్యం ముద్దుబిడ్డ కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టు ఆయన ఆహార్యం ఉంది. గిరిజనులు ధరిచేటటువంటి పూసల గొలుసు లాంటిది ఎన్టీఆర్ మేడలో ఉంది. ముస్లిం యువకుడి ఆహార్యంలో ఉన్నప్పుడు మాత్రం ఆ పూసల గొలుసు లేదు. మారింది.
రామ్ చరణ్ పేరు
సినిమాలో రామ్ చరణ్ పేరు అల్లూరి సీతారామ రాజు. ఆయన డ్రస్ మీద 'ఎ. రామ రాజు' అని ఉంది.
జైలులో ఎన్టీఆర్!
స్వరాజ్యం కోసం పోరాటం చేసిన చాలా మందిని బ్రిటీషర్లు జైలులో వేశారు. అలాగే, ఎన్టీఆర్‌ను వేసి ఉండొచ్చు. 'జనని...' పాటలోని ఓ దృశ్యంలో ఎన్టీఆర్ జైలులో కనిపించారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే... ఎన్టీఆర్‌ను జైలులో వేసింది ఎవరు? అని! ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఓ ఫైట్ ఉంటుందని 'ఆర్ఆర్ఆర్' రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్‌ను జైలులో వేసింది రామ్ చరణా? కాదా? అన్నది సినిమాలో తెలుస్తుంది.
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మరణించే వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు - రాజమౌళి
Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?
Also Read: త్రివిక్రమ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు
Also Read: కంగనా రనౌత్ పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు... వివాదాస్పద వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని ఆర్డర్
Also Read: హీరోయిన్‌కు ఎదురైన సంఘటనల వల్లే 'అఖండ' ఎంట్రీ... బాలకృష్ణ సెట్‌లోకి నడిచి వస్తుంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి