News
News
X

Adivi Sesh Birthday Special: ‘హిట్ 2’ నుంచి ఆ సీన్ రిలీజ్ చేశారు, చూశారా ?

అడవి శేష్ నటించిన ‘హిట్ 2’ సినిమా భారీ హిట్ ను అందుకుంది. డిసెంబర్ 17 న అడివి శేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా శేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఆ మూవీ నుంచి ఓ సీన్ విడుదల చేసింది మూవీ టీమ్.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదిగారు అడివి శేష్. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినా ఆయనకు మంచి గుర్తింపు లభించలేదు. 2011 లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన పంజా సినిమాలో విలన్ గా కనిపించి మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు శేష్. ఆ తరువాత వరుస అవకాశాలు వచ్చాయి. ఇటీవల ఆయన నటించిన ‘హిట్ 2’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. డిసెంబర్ 17 న అడివి శేష్ పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘హిట్ 2’ మూవీ టీమ్ శేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఆ సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సీన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది.

‘హిట్ 2’ సినిమాలో వచ్చే మొదటి సీన్ కూడా ఇదే. ఇందులో అడివి శేష్ వైజాగ్ ఎస్పీ కృష్ణ దేవ్(కె డి) గా కనిపిస్తారు. ఈ ప్రారంభ సీన్ లో ఆయన ఓ హత్య కేసును చేధిస్తారు. ఓ వ్యక్తి తన తమ్ముడుని హత్య చేసి ఎవరికీ తెలియకుండా బీచ్ లో పడేస్తాడు. ఆ విషయం ఎస్పీ కి తెయడంతో క్రైమ్ సీన్ కు చేరుకుంటారు. ఈ హత్య కేసును కొన్ని క్షణాల్లో చేధించి, హత్య చేసింది అతని అన్నయ్యేనని ప్రూవ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేస్తారు. అయితే తర్వాత మీడియాతో మాట్లాడుతూ జనరల్ గా ఇలాంటి హంతకులది కోడి బుర్రలు, వీళ్లని పట్టుకోవడానికి 5 నిమిషాలు చాలు అని అంటారు. ఇక్కడ నుంచే సినిమా అసలు కథ మొదలవుతుంది. ఈ సీన్ ప్రేక్షకులను సినిమాలోకి తీసుకువెళ్తుంది. అడవి శేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సీన్ ను విడుదల చేశారు మూవీ టీమ్. ఈ వీడియో చూసి చాలా బాగుందంటూ హీరో అడివి శేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు ఫ్యాన్స్.  

ప్రస్తుతం అడివి శేష్ కు మంచి డిమాండ్ ఉంది. ‘బాహుబలి’ లాంటి భారీ సినిమాలో నటించిన తర్వాత 2018 లో అడవి శేష్ ‘గూఢచారి’ సినిమాలో హీరో గా నటించారు. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇక శేష్ వెనుదిరిగి చూడలేదు. అమీ తుమి, గూడాఛారి, ఎవరు, క్షణం, మేజర్, హిట్2 సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టిచారు. ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా హీరో గా ఎదిగారు. దీంతో అడవి శేష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అడవి శేష్ సినిమాలో కనిపిస్తే చాలు సినిమా సూపర్ హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయేలా తన మార్కెట్ ను పెంచుకున్నారు. ఇక ‘హిట్ 2’ తో స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు శేష్. మరి ఆయన నుంచి మున్ముందు ఎలాంటి భారీ ప్రాజెక్టులు వస్తాయో చూడాలి.

Published at : 18 Dec 2022 11:57 AM (IST) Tags: nani Adivi Sesh HIT 2 Sailesh kolanu Adivi Sesh Birthday

సంబంధిత కథనాలు

K Viswanath : విశ్వనాథ్ సినిమాల్లోనే కమల్ హాసన్, చిరంజీవి నట విశ్వరూపం చూపించారెందుకు?

K Viswanath : విశ్వనాథ్ సినిమాల్లోనే కమల్ హాసన్, చిరంజీవి నట విశ్వరూపం చూపించారెందుకు?

K Viswanath : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!

K Viswanath : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే 'నిజం విత్ స్మిత' మొదలు

Nijam With Simtha : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే  'నిజం విత్ స్మిత' మొదలు

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ఎందుకంటే?

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్

టాప్ స్టోరీస్

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

Konda Murali: మాకు ఒక్క సీటు చాలు, బరిలో నిలిచేది ఎవరో కొండా మురళీ క్లారిటీ

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?