(Source: Poll of Polls)
RIMC Admissions TSPSC: ఇండియన్ మిలిటరీ కాలేజీ లో 8వ తరగతి ప్రవేశాలు, నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో జనవరి- 2025 టర్మ్ 8f తరగతి ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
The Rastriya Indian Military College Admissions: ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని 'రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (RIMC)'లో జనవరి- 2025 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 2025 నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా 7వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, వైవా వోస్, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్న విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 1న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
వివరాలు..
* ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు జనవరి- 2025 టర్మ్
అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి జనవరి 2024 నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా 7వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు: 01.01.2025 నాటికి 11.5 - 13 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.2012 - 01.07.2013 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లించాలి. ''THE COMMANDANT RIMC FUND”, DRAWEE BRANCH, HDFC BANK, BALLUPUR CHOWK, DEHRADUN, (BANK CODE- 1399), UTTARAKHAND'' పేరిట డిడి తీయాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత చిరునామాకు నిర్ణీత మొత్తంతో తీసిన డిడి పంపడం ద్వారా దరఖాస్తులు పొందవచ్చు. ఆర్ఐఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువతపత్రాలు జతచేసి హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌సర్వీస్ కమిషన్ చిరునామాకు పంపించాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా వోస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్షా విధానం: రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి మ్యాథమేటిక్స్(200 మార్కులు), జనరల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్(125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించినఅభ్యర్థులకు వైవా వోస్(50 మార్కులు) నిర్వహిస్తారు. రాత పరీక్ష, వైవా వోస్ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రం: హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥దరఖాస్తుకు చివరి తేది: 15.04.2024.
➥ పరీక్ష తేది: 01.06.2024.
ALSO READ:
ఏపీ 'మోడల్ స్కూల్స్' ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల, ఎగ్జామ్ ఎప్పుడంటే?
ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో (Mode Schools) ఆరో తరగతిలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 1న వెలువడింది. విద్యార్థులు మార్చి 1 నుండి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 21న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్‌తో తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..