TS SSC Exams: పదోతరగతి హాల్‌టికెెట్లు వచ్చేస్తున్నాయ్! పరీక్షల నిర్వహణపై మంత్రి సమీక్ష!
విద్యార్థుల హాల్‌టికెట్లను మార్చి 24 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. విద్యార్థుల హాల్‌టికెట్లను వారివారి పాఠశాలలకు పంపుతామని మంత్రి తెలిపారు.
➥ మార్చి 24 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో
➥ పరీక్షలపై 'నిఘా' నేత్రం
ఏప్రిల్ 3న నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి పరీక్షలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం (మార్చి 18) సమీక్ష నిర్వహించారు. బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యార్థుల హాల్‌టికెట్లను మార్చి 24 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. విద్యార్థుల హాల్‌టికెట్లను వారివారి పాఠశాలలకు కూడా పంపుతామని మంత్రి సబిత తెలిపారు.
ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి, పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పది విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 24 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా పాఠశాలలకు కూడా హాల్‌టికెట్లు పంపుతామని చెప్పారు.
'నిఘా' నీడలో పదో తరగతి పరీక్షలు..
రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశ లేకుండా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా పరీక్షలన్నింటినీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను అమర్చాలని అధికారులను ఆదేశించింది. సీల్ చేసిన ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసినప్పటి నుంచి తిరిగి జవాబు పత్రాలను ప్యాక్ చేసే ప్రక్రియనంతా సీసీ కెమెరాలలో రికార్డు చేయాలని సూచించింది. ఈ మేరకు పరీక్షల డైరెక్టర్ విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్ష పేపర్ల లీకేజీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలలో ఈ తరహా లీకేజీకి పాల్పడవచ్చని అనుమానంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కెమెరాలను చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అధికారి గదుల్లో బిగించాలని ఆదేశించింది. ప్రభుత్వబడుల సెంటర్లన్నింటిలో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు డీఈవోలకు ఆదేశాలిచ్చారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 5.1లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
సీసీ కెమెరాల వినియోగం, పర్యవేక్షణ ఇలా..
➥ పరీక్ష కేంద్రాల్లో 3 మెగా పిక్సెల్, 30 మీటర్ల రేంజ్, 180 డిగ్రీల వరకు కవర్‌చేసేలా సీసీ కెమెరా ఉండాలి.
➥ సీసీటీవీ పుటేజీలకు మానిటర్లను ఏర్పాటు చేసుకోవాలి.
➥ చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షల ఆఖరు రోజున సీసీటీవీ ఫుటేజీని సీల్డ్ కవర్‌లో భద్రపరిచి డీఈవోలకు అందజేయాలి.
➥ ఒక్కో కెమెరా కిరాయికి రూ.586, కొనుగోలు చేయాలనుకొంటే రూ.6,900 వెచ్చించవచ్చు.
➥ పరీక్షల్లో రికార్డు అయిన డేటాను నిక్షిప్తంచేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత సాఫ్ట్‌కాపీని భద్రపరచాలి.
➥ సీసీటీవీ కెమెరాల కొనుగోలు లేదా కిరాయి కోసం జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలి.
➥ ప్రైవేట్ బడుల సెంటర్లలో ఆయా యాజమాన్యాలు సొంతంగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలి.
పరీక్షల షెడ్యూలు..
తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి.
ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
పరీక్ష తేదీ | పేపరు |
ఏప్రిల్ 3 | ఫస్ట్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 4 | సెకండ్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 6 | ఇంగ్లిష్ |
ఏప్రిల్ 8 | మ్యాథమెటిక్స్ |
ఏప్రిల్ 10 | సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ) |
ఏప్రిల్ 11 | సోషల్ |
ఏప్రిల్ 12 | ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు |
ఏప్రిల్ 13 | ఓరియంటెల్ పేపర్-2 |