Stock Market News: షేర్ బజార్‌లో కొనుగోళ్ల పండుగ! గట్టిగానే లాభపడ్డ సెన్సెక్స్, నిఫ్టీ
Stock Market Closing bell: ఆసియా మార్కెట్లు లాభాల్లో ఓపెనవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండటం మదుపర్లలో జోష్ పెంచాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,392 వద్ద ముగిసింది.
Stock Market Closingbell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) వరుసగా రెండో రోజు లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఓపెనవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండటం మదుపర్లలో జోష్ పెంచాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,392 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 874 పాయింట్లు లాభపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 57,037 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,458 వద్ద లాభాల్లో మొదలైంది. ఉదయం నుంచి అదే జోరు కొనసాగిస్తోంది. 57,311 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా పుంజుకొని 57,991 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 871 పాయింట్ల లాభంతో 57,911 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 17,136 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,234 వద్ద ఓపెనైంది. ఉదయం 17,215 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం ఒక్కసారిగా కొనుగోళ్లు పుంజుకోవడంతో 17,414 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. మొత్తంగా 256 పాయింట్ల లాభంతో 17,392 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం 36,513 వద్ద మొదలైంది. 36,395 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,913 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 501 పాయింట్ల లాభంతో 36,816 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభపడగా 8 నష్టాల్లో ముగిశాయి. ఐచర్ మోటార్స్, కోల్ ఇండియా, ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్, కొటక్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. సిప్లా, హిందాల్కో, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో, టాటా స్టీల్ నష్టపోయాయి. బ్యాంకు, ఫార్మా, ఆటో, ఐటీ, పవర్, రియాల్టీ, క్యాపిటల్స్ గూడ్స్ సూచీలు 1-2 శాతం వరకు ఎగిశాయి.
Ms. Neelam Rani, Senior IFS Officer along with Shri @ashishchauhan, MD&CEO, @BSEIndia pose with the #BSEBull on 20th April, 2022 pic.twitter.com/uaJNQCFLVK
— BSE India (@BSEIndia) April 20, 2022
View this post on Instagram