By: ABP Desam | Updated at : 10 Mar 2022 03:53 PM (IST)
Edited By: Ramakrishna Paladi
షేర్ మార్కెట్
Indian Stock markets: భారత స్టాక్ మార్కెట్లు గురువారం జోష్ చూపించాయి! ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు (UP election results) మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంటును పెంచాయి. బీజేపీ స్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. యుద్ధ భయాల నుంచీ కాస్త తేరుకున్నట్టు కనిపిస్తోంది. ఉదయం నుంచీ భారీ లాభాల్లో ఉన్న మార్కెట్లో ఆఖర్లో మాత్రం కాస్త జోరు తగ్గాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 54,647 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 56,242 వద్ద మొదలైంది. భారీ గ్యాప్ అప్‌తో అదరగొట్టింది. 54,982 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ ఆ తర్వాత కొనుగోళ్ల ఊపుతో 56,242 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. 1350 పాయింట్ల లాభంతో కొనసాగింది. ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక మదుపర్లు లాభాలు స్వీకరించడంతో చివరికి 817 పాయింట్ల లాభంతో 55,464 వద్ద ముగిసింది.
NSE Nifty
బుధవారం 16,345 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,757 వద్ద ఆరంభమైంది. మదుపర్లు విపరీతంగా కొనుగోళ్లు చేయడంతో దాదాపుగా 2.5 శాతం వరకు లాభాల్లో ట్రేడైంది. 16,757 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకోవడంతో 387 పాయింట్ల లాభంతో నమోదు చేసింది. చివర్లో సూచీ 16,447 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకడంతో మొత్తంగా 249 పాయింట్ల లాభంతో 16,594 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంకు ఉదయం దూసుకెళ్లింది. 35,153 వద్ద మొదలైన సూచీ బ్యాంకు షేర్లకు డిమాండ్ పెరగడంతో 35,374 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఒకానొక దశలో 1510 పాయింట్ల లాభంతో 35,325 వద్ద ట్రేడ్ అయింది. 34,218 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేయడంతో చివరికి 660 పాయింట్ల లాభంతో 34,475 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీలో 4౩ కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో కదలాడాయి.హిందుస్థాన్ యూనీలివర్, టాటా స్టీల్, గ్రాసిమ్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3-6 శాతం వరకు లాభపడ్డాయి. కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, ఓఎన్‌జీసీ నష్టాల్లో ముగిశాయి. ఆటో, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, పవర్, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ బ్యాంక్స్, రియాల్టీ సూచీలు 1-2 శాతం రాణించాయి.
BSE commodity price update 9th March, 2022#commodity #exchange #cotton#BRCrude #Gold #Turmeric #Almond #trade #futuretrading #commoditytrading pic.twitter.com/yOt11F1kgC
— BSE India (@BSEIndia) March 10, 2022
Join us tomorrow at 12:15PM for the listing ceremony of Aavas First Social Masala Bond on NSE IFSC. Watch the event live on Facebook https://t.co/3C6yKc6GwZ#NSE #IFSC #Listing pic.twitter.com/5nEDC6mtwo
— NSEIndia (@NSEIndia) March 10, 2022
₹2,000 Notes: మార్కెట్ నుంచి సగం పింక్ నోట్లు మాయం, ₹500 నోట్లపై కీ అప్‌డేట్
Stocks Watch Today, 09 June 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Kotak Bank, HAL
Top 10 Headlines Today: కేసీఆర్ వ్యూహం ఏంటీ? అవినాష్ అరెస్టు విడుదల!, రహానే-భరత్‌పైనే భారం, ఇవే మార్నింగ్ చూడాల్సిన వార్తలు
Gold-Silver Price Today 09 June 2023: రేటు తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Maruti Suzuki Engage: ‘ఎంగేజ్’తో రానున్న మారుతి - అత్యంత ఖరీదైన కారుగా!
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?
చెరువుల పండుగలో అపశ్రుతి- నాటు పడవలో వెళ్తూ నీటిలో పడిపోయిన మంత్రి గంగుల
MP Avinash Reddy Arrest In YS Viveka Case: ఈ నెల 3వ తేదీన అరెస్ట్ చేసిన సీబీఐ