By: Arun Kumar Veera | Updated at : 31 Jan 2025 11:20 AM (IST)
పేమెంట్ చేయాలంటే ఈ రూల్ ఫాలో కావాలి ( Image Source : Other )
NPCI New Rule On UPI Transaction ID: మన దేశంలో, ప్రజల అవసరాల్లో UPI కూడా ఒక భాగంగా మారింది. ఇది, అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపు పద్ధతి. 2024 డిసెంబర్‌లో UPI లావాదేవీల సంఖ్య 16.73 బిలియన్లకు చేరుకుంది, మునుపటి నెల కంటే ఇది 8% పెరుగుదల. ముఖ్యంగా, పెద్ద నగరాల్లో నగదు కంటే UPI ద్వారానే డబ్బు పంపుతున్నారు & చెల్లింపులు చేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల, NPCI ఒక కొత్త సర్క్యులర్ జారీ చేసింది, UPI యూజర్లంతా దీనిని ఫాలో కావాలి. లేకపోతే UPI ద్వారా చెల్లింపు చేయలేరు, ఆ లావాదేవీ ఫెయిల్ అవుతుంది. మీరు కూడా UPI పేమెంట్ యాప్‌ను ఉపయోగిస్తుంటే, ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది.
NPCI ఒక కొత్త సర్క్యులర్ ప్రకారం, ఫిబ్రవరి 01 నుంచి, ఏ UPI యాప్ ట్రాన్జాక్షన్ ఐడీ (UPI transaction ID)లో స్పెషల్ క్యారెక్టర్స్ (special characters) ఉపయోగించరాదు. UPI లావాదేవీ IDలో ప్రత్యేక అక్షరాలను ఉపయోగిస్తే, సెంట్రల్ సిస్టమ్ ఆ చెల్లింపును రద్దు చేస్తుంది. 'నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI) వ్యాపార వినియోగదార్ల కోసం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే, ఇది సాధారణ కస్టమర్లను కూడా ప్రభావితం చేయబోతోంది.
స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి?
NPCI సర్క్యులర్ ప్రకారం, అన్ని UPI లావాదేవీ IDలు ఖచ్చితంగా 'ఆల్ఫాన్యూమరిక్'గా ఉండాలి. అంటే, అంకెలు & ఆంగ్ల అక్షరాలు మాత్రమే ఐడీలో ఉండాలి. @, !, లేదా # వంటి స్పెషల్ క్యారెక్టర్స్‌ను ఉపయోగించలేము. ఇలాంటి ప్రత్యేక అక్షరాలతో కూడిన IDలను ఉపయోగించే లావాదేవీలు ఆటోమేటిక్‌గా ఫెయిల్ అవుతాయి. చాలా బ్యాంకులు & పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే ఈ రూల్‌కు అనుగుణంగా మారినప్పటికీ, కొన్ని సంస్థలు నిషేధిత ఫార్మాట్‌లను ఉపయోగిస్తున్నాయని NPCI వెల్లడించింది.
మరో ఆసక్తికర కథనం: మీరు వదిలేసిన బ్యాంక్ అకౌంట్‌లో చాలా డబ్బు ఉండొచ్చు - ఆ డబ్బును ఇలా విత్‌డ్రా చేయండి
UPI లావాదేవీ ఫెయిల్ కాకూడదంటే ఏం చేయాలి?
UPI ద్వారా మీరు చేసే చెల్లింపు ఫెయిల్ కాకూడదంటే, ముందుగా, మీ UPI ID ఫార్మాట్ NCPI కొత్త రూల్‌కు అనుగుణంగా ఉందో, లేదో చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు, 1234567890oksbi వంటి ID చెల్లుబాటు అవుతుంది. 1234567890@ok-sbi ఐడీ పని చేయదు.
UPI ID ఫార్మాట్‌ను ఎక్కడ చెక్ చేయాలి?
మీ UPI యాప్‌లోకి వెళ్లి, మీ UPI ID ఫార్మాట్‌ను చెక్ చేయవచ్చు & అవసరమైతే దానిని సరి చేయవచ్చు. దీనికి గడువు జనవరి 31 వరకు మాత్రమే ఉంది, ఫిబ్రవరి 01 నుంచి మీరు చెల్లింపు చేయలేరు. కాబట్టి, చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా గడువుకు ముందే దీనిని సరి చేయండి. మరింత సాయం కోసం మీరు నేరుగా కస్టమర్ సపోర్ట్ టీమ్‌కు కాల్ చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఒక్కరోజులో రూ.13,100 పెరిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Employees Health Insurance: జాబ్ ఆఫర్లలోనూ కీలకంగా మారుతున్న ఆరోగ్య బీమా, ఎందుకీ మార్పు?
Swiggy Shares Down: ఒకటీ, రెండూ కాదు - ఏకంగా రూ.51,000 కోట్లు పోగొట్టుకున్న స్విగ్గీ షేర్‌హోల్డర్లు
PF Withdrawals: ఉద్యోగులకు బంపర్ బెనిఫిట్ - UPI ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే ఛాన్స్!
Gold Price: 10 గ్రాముల బంగారం కొన్నారంటే పాతిక వేలు ఎక్కువ పెట్టినట్లే! నమ్మట్లేదా?, ఇదిగో లెక్క
Gold-Silver Prices Today 23 Feb: పసిడి రేటు వింటే ఏడుపొస్తుంది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
YS Jagan: లోకేష్ మోసపూరిత ప్రకటన, చంద్రబాబు ఆడియో లీకులతో మరో డ్రామా: గ్రూప్ 2 అంశంపై జగన్ ఫైర్
Urvashi Rautela: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌లో ఊర్వశీ రౌతేలాకు సర్‌ప్రైజ్... స్టేడియంలో అందాల భామ బర్త్ డే
SLBC Tunnel Rescue operation: వారిని టన్నెల్ నుంచి బయటకు తేవడం కష్టమే, లోపల భయానక పరిస్థితి: మంత్రి జూపల్లి
Samantha: సమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్