సిగ్నెల్ పోతే
abp live

సిగ్నెల్ పోతే

ఇంటర్నెట్ లేకపోయినా UPI పేమెంట్ చేసేయండిలా

Published by: Geddam Vijaya Madhuri
వేగంగా..
abp live

వేగంగా..

డిజిటల్ చెల్లింపుల్లో ట్రెండ్ వల్ల పేమెంట్స్ చేయడం చాలా సులభమై పోయింది. UPI(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్​ఫేస్) చేయడం వల్ల లావాదేవీలు మరింత వేగంగా, సరళంగా మారుతున్నాయి.

అత్యవసర పరిస్థితుల్లో
abp live

అత్యవసర పరిస్థితుల్లో

అయితే కొన్నిసార్లు ఫోన్​కు ఇంటర్నెట్ అందదు. కానీ వెంటనే పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఇంటర్నెట్ లేకున్నా.. UPI ద్వారా పేమెంట్ చేయొచ్చట.

ఈ కోడ్​తో పేమెంట్ చేయొచ్చట
abp live

ఈ కోడ్​తో పేమెంట్ చేయొచ్చట

ఈ సదుపాయం USSD కోడ్ (*99#) ద్వారా అందుబాటులో ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరే,న్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ సౌలభ్యాన్ని తెచ్చింది.

abp live

NPCI తెచ్చింది ఇందుకే..

స్మార్ట్​ఫోన్ లేనివారు లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేనివారి కోసం NPCI ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది.

abp live

ఆ రెండు లింక్ అవ్వాలి..

ముందుగా మీ బ్యాంక్ ఖాతా, UPIకి లింక్ చేసిన నంబర్​ను ఉపయోగించాలి. ఫోన్​ నుంచి *99#కి డయల్ చేయాలి. ఈ సదుపాయం అన్ని మొబైల్ నెట్​వర్క్స్​లో అందుబాటులో ఉంది.

abp live

వాడుక భాష

దీనిలో మీరు భాషను ఎంచుకునే అవకాశముంటుంది. మీకు ఇష్టమైన భాషను ఎంచుకొని బ్యాలెన్స్ చెక్ చేసుకోవాల. మనీ ట్రాన్స్​ఫర్ పిన్ సెట్టింగ్ వంటి మొదలైన ఆప్షన్​లు స్క్రీన్​పై కనిపిస్తాయి.

abp live

సెండ్ మనీ

డబ్బు పంపేందుకు సెండ్ మనీ ఆప్షన్​ను ఎంచుకొని.. రిసీవర్ యూపీఐ ఐడీ లేదా మొబైల్ నెంబర్​ను ఎంటర్​ చేయాలి. మీరు ఎంత అమోంట్ పంపాలనుకుంటున్నారో రాయాలి.

abp live

పిన్ ఎంటర్

పేమెంట్​ను పూర్తి చేయడానికి మీ యూపీఐ పిన్​ని ఎంటర్​ చేయాలి. మీ పేమెంట్ సక్సెస్ అవుతుంది.

abp live

అన్ని ఫోన్​లలో..

ఈ ఫీచర్ బేసిక్ ఫీచర్ ఫోన్​లలో కూడా పని చేస్తుంది. డేటా కనెక్షన్ లేకుండా చెల్లింపు చేయవచ్చు. ప్రతి పేమెంట్​కి పిన్ అడుగుతుంది కాబట్టి ఇది పూర్తిగా సురక్షితం కూడా.

abp live

హెల్ప్​ ఫుల్​గా ఉంటుంది

ఇంటర్నెట్ సదుపాయం పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డిజిటిల్ ఇండియా సక్సెస్ అవ్వడంలో ఇది హెల్ప్ చేస్తుంది.