search
×

Gold-Silver Prices Today 31 Jan: ఒక్కరోజులో రూ.13,100 పెరిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Silver- Platinum Prices Today: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 1,07,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 26,850 వద్ద ఉంది.

FOLLOW US: 
Share:

Latest Gold-Silver Prices Today: యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచకపోవడం, ట్రంప్‌ టారిఫ్‌ విధానాలపై భయాల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి వైపు ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారు. దీంతో, గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు భారీగా పెరిగింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర రికార్డ్‌ స్థాయిలో 2,850 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలోనూ పుత్తడి రేటు అతి భారీగా పెరిగింది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 1,310 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 1,200 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 980 రూపాయల చొప్పున పెరిగాయి. ఈ లెక్కన, 100 గ్రాముల (24K) రేటు ఒకేసారి రూ.13,100 పెరిగింది. ఈ రోజు, కిలో వెండి ధర 1,000 రూపాయలు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్‌, కేంద్ర బడ్జెట్‌ వంటివి కూడా దేశీయంగా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 84,330 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 77,300 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 63,250 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,07,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 84,330 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 77,300 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 63,250 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,07,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 84,330  ₹ 77,300  ₹ 63,250  ₹ 1,07,000 
విజయవాడ ₹ 84,330  ₹ 77,300  ₹ 63,250  ₹ 1,07,000 
విశాఖపట్నం ₹ 84,330  ₹ 77,300  ₹ 63,250  ₹ 1,07,000 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,730 ₹ 8,433
ముంబయి ₹ 7,730 ₹ 8,433
పుణె ₹ 7,730 ₹ 8,433
దిల్లీ ₹ 7,745 ₹ 8,448
 జైపుర్‌ ₹ 7,745 ₹ 8,448
లఖ్‌నవూ ₹ 7,745 ₹ 8,448
కోల్‌కతా ₹ 7,730 ₹ 8,433
నాగ్‌పుర్‌ ₹ 7,730 ₹ 8,433
బెంగళూరు ₹ 7,730 ₹ 8,433
మైసూరు ₹ 7,730 ₹ 8,433
కేరళ ₹ 7,730 ₹ 8,433
భువనేశ్వర్‌ ₹ 7,730 ₹ 8,433

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 7,366 ₹ 7,956
షార్జా ‍‌(UAE) ₹ 7,366 ₹ 7,956
అబు ధాబి ‍‌(UAE) ₹ 7,366 ₹ 7,956
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 7,449 ₹ 7,944
కువైట్‌ ₹ 7,184 ₹ 7,835
మలేసియా ₹ 7,117 ₹ 7,412
సింగపూర్‌ ₹ 6,945 ₹ 7,706
అమెరికా ₹ 6,759 ₹ 7,192

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 220 పెరిగి రూ. 26,850 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: మార్కెట్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లకు సెబీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ - ఈ పని చేస్తే రిజిస్ట్రేషన్‌ రద్దు! 

Published at : 31 Jan 2025 10:50 AM (IST) Tags: Hyderabad Gold Price Today Silver Price Today Vijayawada Todays Gold Silver rates

ఇవి కూడా చూడండి

LIC Pension Plan: ఒక్కసారి పెట్టుబడి పెట్టండి, జీవితాంతం కాలు మీద కాలు వేసుకుని తినండి

LIC Pension Plan: ఒక్కసారి పెట్టుబడి పెట్టండి, జీవితాంతం కాలు మీద కాలు వేసుకుని తినండి

EPF Interest Rate: 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌పై ఎంత వడ్డీ చెల్లిస్తారు?, ఈ వారంలోనే నిర్ణయం

EPF Interest Rate: 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌పై ఎంత వడ్డీ చెల్లిస్తారు?, ఈ వారంలోనే నిర్ణయం

Gold-Silver Prices Today 24 Feb: కొత్త రికార్డ్‌ దిశగా పసిడి రేటు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 24 Feb: కొత్త రికార్డ్‌ దిశగా పసిడి రేటు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Employees Health Insurance: జాబ్‌ ఆఫర్లలోనూ కీలకంగా మారుతున్న ఆరోగ్య బీమా, ఎందుకీ మార్పు?

Employees Health Insurance: జాబ్‌ ఆఫర్లలోనూ కీలకంగా మారుతున్న ఆరోగ్య బీమా, ఎందుకీ మార్పు?

Swiggy Shares Down: ఒకటీ, రెండూ కాదు - ఏకంగా రూ.51,000 కోట్లు పోగొట్టుకున్న స్విగ్గీ షేర్‌హోల్డర్లు

Swiggy Shares Down: ఒకటీ, రెండూ కాదు - ఏకంగా రూ.51,000 కోట్లు పోగొట్టుకున్న స్విగ్గీ షేర్‌హోల్డర్లు

టాప్ స్టోరీస్

SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!

SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!

GV Reddy Resign: టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది

GV Reddy Resign: టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది

Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం

Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం

India In Semi Final: సెమీస్ లో ఇండియా, న్యూజిలాండ్.. బంగ్లా ప‌రాజ‌యంతో ఇరుజ ట్లు నాకౌట్ కు.. టోర్నీ నుంచి పాక్, బంగ్లా ఔట్

India In Semi Final: సెమీస్ లో ఇండియా, న్యూజిలాండ్.. బంగ్లా ప‌రాజ‌యంతో ఇరుజ ట్లు నాకౌట్ కు.. టోర్నీ నుంచి పాక్, బంగ్లా ఔట్