By: ABP Desam | Updated at : 30 Jul 2022 07:48 AM (IST)
వాహనదారులకు ఊరట
Petrol Price Today 30 July 2022: హైదరాబాద్‌లో చాలా రోజుల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో జూలై 30 (శనివారం) లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 30 July 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు.
తెలంగాణలో ఇంధన ధరలు..
నేడు వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.35 అయింది.
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.39 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.55 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) పెరిగాయి. 31 పైసలు పెరగడంతో కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.85 కాగా, 29 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.97.99 అయింది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 22 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.111.33 కాగా, 22 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.38 అయింది. మహబూబ్ నగర్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.110.60 కాగా, డీజిల్ లీటర్ రూ.98.70 అయింది. నల్గొండ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.83 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.96 అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో ఇంధన ధరలు మారాయి. పెట్రోల్ (Petrol Price in Vijayawada 30 July 2022) లీటర్ ధర రూ.111.33 కాగా, 18 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.12 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధర నిలకడగా ఉంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.88 అయింది. డీజిల్ లీటర్ ధర రూ.98.27 అయింది.
చిత్తూరులో 39 పైసలు దిగొచ్చి పెట్రోల్ లీటర్ రూ.111.96 కాగా, డీజిల్ ధర సెంచరీ నుంచి దిగొచ్చింది. 37 పైసలు తగ్గడంతో చిత్తూరులో డీజిల్ లీటర్ ధర రూ.99.64 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. కర్నూలులో 60 పైసలు తగ్గడంతో పెట్రోల్ ధర రూ.111.64 కాగా, డీజిల్ ధర రూ. 99.40 అయింది. నెల్లూరులో పెట్రోల్ ధర రూ.111.16 కు చేరింది. డీజిల్ ధర రూ.98.90 అయింది.
ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ఊరట..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.9.5 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగిన సమయంలో భారత్ సహా పలు దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Gold-Silver Prices Today 23 Dec: రూ.78 వేల దగ్గర బంగారం, రూ.99 వేల దగ్గర వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Travel Credit Cards: సెలవుల సంతోషాన్ని రెట్టింపు చేసే ట్రావెల్ క్రెడిట్ కార్డ్స్ - రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్స్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్