By: ABP Desam | Updated at : 25 Dec 2021 08:04 PM (IST)
Edited By: Ramakrishna Paladi
మల్టీ బ్యాగర్ స్టాక్
అంతర్జాతీయంగా కొవిడ్ ఉన్నా భారత స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది మెరుగ్గానే రాణించాయి. చాలా పెన్నీ స్టాక్స్ మల్టీబ్యాగర్‌గా అవతరించాయి. మదుపర్ల పెట్టుబడికి ఇబ్బడి ముబ్బడిగా రాబడినిచ్చాయి. గుజరాత్‌కు చెందిన వస్త్రాల తయారీ కంపెనీ 'దిగ్‌జామ్' అలాంటిదే. మూడేళ్లలో ఈ స్టాక్ బీఎస్‌ఈలో 97 పైసల నుంచి రూ.194కు పెరిగింది. దాదాపుగా 19,900 శాతం ర్యాలీ చేసింది. కేవలం 2021లోనే 1000 శాతం రాణించింది.
చివరి నెల రోజుల్లోనే దిగ్‌జామ్ షేరు రూ.66.60 నుంచి రూ.194 స్థాయికి చేరుకుంది. ఇక చివరి మూడు నెలల్లో ఈ మల్టీబ్యాగర్ రూ.17.27 నుంచి రూ.194కు పెరిగింది. అంటే దాదాపుగా వెయ్యిశాతం ర్యాలీ చేసింది. అలాగే ఈ ఏడాదిలో ఈ షేరు రూ.3.98 నుంచి 4800 శాతం పెరిగి రూ.194కు చేరుకుంది. మూడేళ్లలో అయితే రూ.0.97 నుంచి 200 రెట్లు పెరిగి రూ.194కు ఎగిసింది.
దిగ్‌జామ్‌లో నెల రోజుల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.1.90 లక్షలు అందేవి. మూడు నెలల క్రితం పెట్టుంటే రూ.11 లక్షలుగా మారేవి. ఏడాది క్రితం రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు ఏకంగా రూ.49 లక్షల లాభం కళ్లచూసేవారు. మూడేళ్ల క్రితం ఎవరైనా లక్ష రూపాయాలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడవి రూ.2 కోట్లుగా మారేవి.
ఈ మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్ 2021లో ఆల్ఫాస్టాక్‌గా ఎంపికైంది. బెంచ్‌మార్క్ సూచీలను భారీ తేడాతో బీట్ చేసింది. ఈ మూడేళ్లలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 57 శాతం రాబడి ఇవ్వగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 59 శాతం రాబడినిచ్చింది. దిగ్‌జామ్ మాత్రం ఏకంగా 200 రెట్లు పెరిగింది.
నోట్: స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్నది! ఇది కేవలం సమాచారం కోసమే అందిస్తున్నాం. ఫలానా స్టాక్, ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలు పరిశీలించుకొని, విశ్లేషించుకోవాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి!
Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.
Also Read: 28 Days Validity: అమ్మో.. 28 రోజుల వ్యాలిడిటీ వెనుక ఇంత కథా.. రూ.వేల కోట్ల ఆదాయం!
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
Also Read: Cyber Crime: మీ మొబైల్ ఫోన్ సేఫేనా! పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
Also Read: Medplus IPO: మెడ్‌ప్లస్ లిస్టింగ్ సూపర్‌హిట్.. లాట్‌కు లాభం ఎంతొచ్చిందంటే?
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..