By: ABP Desam | Updated at : 06 Aug 2022 01:32 PM (IST)
గృహ రుణాలు,
Cheapest Home Loans: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపోరేటును మరో 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నిర్ణయం ప్రకటించారు. కేవలం తొమ్మిది నెలల కాలంలో కేంద్ర బ్యాంకు రెపోరేటును సవరించడం ఇది మూడోసారి.
5.40 శాతానికి రెపో రేటు
రెపోరేటును ఎప్పుడు సవరించినా దాని ప్రభావం రుణాలు, ఈఎంఐలపై నేరుగా ఉంటుంది. కొత్త, పాత రుణ గ్రహీతలపై అదనపు భారం పడుతుంది. 2022, మే నెల నుంచి కేంద్ర బ్యాంకు రెపోరేటు పెంపు సైకిల్ ఆరంభించింది. కొన్ని నెలల క్రితం 4 శాతంగా ఉన్న విధాన రేటు ఇప్పుడు 5.40 శాతానికి చేరుకుంది. దాంతో బ్యాంకులు అప్పులపై వడ్డీరేట్లను వెంటనే పెంచేస్తున్నాయి. ఫలితంగా ఈఎంఐల భారం పెరిగి రుణ గ్రహీతలు అల్లాడుతున్నారు.
Also Read: తెలంగాణలో ఇళ్లు కొనలేమా! వడ్డీరేట్ల పెంపు, దేశవ్యాప్త ట్రెండ్ ఏంటి?
Also Read: పని చేయండి లేదా ప్యాక్ చేసుకోండి - 62వేల ఉద్యోగులకు మోదీ సర్కార్ అల్టిమేటమ్!
లోన్ ట్రాన్స్‌ఫర్ ఓ ఛాన్స్
పెరుగుతున్న ఇంటి రుణాల ఈఎంఐల భారం తగ్గించుకొనేందుకు ఓ పరిష్కారం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తక్కువ వడ్డీరేటు అమలు చేస్తున్న బ్యాంకులకు ఇంటి రుణాల బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. చాలా మంది విషయంలో ఇది బాగానే పనిచేస్తున్నా వ్యక్తిగత జీతభత్యాలు, అవసరాలను బట్టి లాభనష్టాలు బేరీజు వేసుకోవాలని చెబుతున్నారు. లోన్ ట్రాన్స్‌ఫర్ వల్ల ఎంతవరకు ఆదా చేయగలరో ముందుగానే లెక్కించుకోవడం అవసరం.
Post Monetary Policy Press Conference by Shri Shaktikanta Das, Governor RBI - Aug 05, 2022 https://t.co/cQ0HOI6z2h
— ReserveBankOfIndia (@RBI) August 5, 2022
ఎక్కువగా ఆఎల్‌ఎల్‌ఆరే
బ్యాంకులు వడ్డీరేట్లను అమలు చేసేందుకు ఏదో ఒక ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌ను అనుసరించాలని ఆర్బీఐ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవి నాలుగు రకాలుగా ఉన్నాయి. ఆర్బీఐ నిర్ణయించే రెపోరేటు, ఫైనాన్షియల్ బెంచ్ మార్క్ ఇండియా ప్రచురించే ప్రభుత్వ 3 నెలల ట్రెజరీ బిల్లుల రాబడి, 6 నెలల ట్రెజరీ బిల్లుల రాబడి, ఫైనాన్షియల్ బెంచ్ మార్క్ ఇండియా లిమిటెడ్ (FBIL) ప్రచురించే ఇంకైదేనా బెంచ్ మార్క్ మార్కెట్ వడ్డీరేటును అనుసరించొచ్చు.
ఇప్పటికైతే చాలా బ్యాంకులు ఆర్బీఐ రెపోరేటునే అనుసరిస్తున్నాయి. వీరు అమలు చేసే దానిని రెపోరేటు అనుసంధాన వడ్డీరేటు (RLLR)గా పిలుస్తారు. ఆర్బీఐ రెపోరేటు, స్ప్రెడ్ లేదా మార్జిన్ కలిపి ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ నిర్ణయిస్తారు.
తక్కువ వడ్డీరేటు ఆఫర్ చేస్తున్న బ్యాంకులు
Bank Account Nominee: ప్రతి బ్యాంక్ ఖాతాలో 4 నామినీ పేర్లు - అతి త్వరలో మార్పులు!
NTPC Green Energy IPO: ఎన్‌టీపీసీ గ్రీన్ ఐపీవో అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఇంట్లో కూర్చునే ఇలా చెక్ చేయండి
Money Saving: జీతం నుంచి నెలవారీ సేవింగ్ - ఈ 7 పద్ధతులు పాటిస్తే మీరే 'కింగ్'
Share Market Today: స్టాక్ మార్కెట్‌లో బుల్ పరేడ్ - సెన్సెక్స్ 1300 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు హైజంప్
Gold-Silver Prices Today 25 Nov: ఏకంగా రూ.1000 తగ్గిన పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?