By: ABP Desam | Updated at : 15 Nov 2023 03:37 PM (IST)
ఎల్‌ఐసీ పాలసీల్లో పాపులర్ ఇది
LIC Jeevan Akshay Policy Details in Telugu: భారతదేశంలో అతి పెద్ద జీవిత బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC), చాలా రకాల పాలసీ పథకాలను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అనుకోని కష్ట సమయంలో బాధిత కుటుంబానికి ఈ ప్లాన్స్ ఆర్థిక రక్షణ (Financial Security Through LIC Policy) కల్పిస్తాయి. అదృష్టవశాత్తు పాలసీదారుకు ఏమీ కాకుంటే, ఇవి దీర్ఘకాలిక పొదుపుగా, పెట్టుబడిగా (Savings, Investment with LIC Policy) ఉంటాయి. అంతేకాదు, ఆదాయ పన్ను కట్టే వారికి పన్ను ప్రయోజనాలు కూడా అందిస్తాయి.
ఎల్‌ఐసీ పథకాలన్నీ ప్రజాదరణ పొందినవే. వాటిలో 'ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పాలసీ' (LIC Jeevan Akshay Policy) ఒకటి. అయితే, మిగిలిన పాలసీల్లా కాకుండా ఇది కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. జీవన్ అక్షయ్ పాలసీలో కేవలం ఒక్కసారి ప్రీమియం (Single Premium) కడితే సరిపోతుంది. నిర్ణీత కాలం తర్వాత, ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బును ఈ స్కీమ్ తిరిగి ఇస్తుంది. మీ జీవితాంతం ఆ డబ్బు వస్తూనే ఉంటుంది.
LIC జీవన్ అక్షయ్ పాలసీ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేట్ సింగిల్ ప్రీమియం డిపాజిట్ ఇమ్మీడియేట్ పెన్షన్ ప్లాన్ (Non Linked non Participated Single Premium deposit Immediate Pension Plan). ఈ రోజు ఈ ప్లాన్ కొనుగోలు చేస్తే, వచ్చే నెల నుంచే రెగ్యులర్ పెన్షన్, అదీ జీవితాంతం వస్తుంది. వృద్ధాప్యంలోనే కాదు, యువతకు కూడా ఈ ప్లాన్ ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఇది ఒక విధంగా పెన్షన్ ప్లాన్ వంటిది.
ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ ప్లాన్ కొనుగోలు చేయడానికి ఉండాల్సిన అర్హతలు, వచ్చే ప్రయోజనాలు, ప్లాన్ ఆప్షన్స్‌తో పాటు... ఒక్కసారి ఎంత అమౌంట్ (One time payment) డిపాజిట్ చేసి ఎంత రెగ్యులర్ పెన్షన్ పొందొచ్చో చూద్దాం.
జీవన్ అక్షయ్ పాలసీ కీలక వివరాలు (LIC Jeevan Akshay Policy Key Features) :
ఎలాంటి రిస్క్, టెన్షన్ లేని పెట్టుబడి మార్గం కోసం చూస్తున్న వాళ్లకు ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పథకం ఒక మంచి ఆప్షన్. ఈ పాలసీని కొనుగోలు చేసే వ్యక్తి వయస్సు 30 నుంచి 85 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పాలసీని సింగిల్‌గా కొనొచ్చు, మరొకరితో కలిసి జాయింట్‌గానూ తీసుకోవచ్చు. సింగిల్ ప్రీమియం ప్లాన్ కాబట్టి, కనీసం ఒక లక్ష రూపాయలకు తక్కువ కాకుండా ఇన్వెస్ట్ చేయాలి. జాయింట్‌గా పాలసీ తీసుకుంటే, ప్రతి ఒక్కరు కనీసం లక్ష రూపాయలు కట్టాలి. పెట్టుబడి పెట్టిన నిర్ణీత కాలం తర్వాత, ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బు తిరిగి వస్తుంది. మీ పెట్టుబడి ఎంత ఎక్కువ ఉంటే, అంత ఎక్కువ పెన్షన్ లభిస్తుంది.
ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ ప్లాన్ ద్వారా ఏడాదికి కనీసం రూ.12,000 వస్తుంది. ఈ డబ్బును ఏ నెలకు ఆ నెల తీసుకోవచ్చు, లేదా 3 నెలలకు, 6 నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి చొప్పున తీసుకోవచ్చు.
10కి పైగా యాన్యుటీ ఆప్షన్స్ (Jeevan Akshay Policy Annuity Options)
జీవన్ అక్షయ్ పాలసీ కింద 10కి పైగా యాన్యుటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. పాలసీ ప్రారంభంలోనే, గ్యారెంటీ యాన్యుటీ రేట్ ఎంతో పాలసీదారుకు తెలుస్తుంది. పాలసీహోల్డర్ ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి నెలవారీ రాబడి కొద్దిగా మారుతుంది. ఈ ప్లాన్ ప్రకారం, పాలసీహోల్డర్ జీవితాంతం పెన్షన్ తీసుకోవచ్చు. అతను మరణిస్తే పెన్షన్ ఆగిపోతుంది. పాలసీ కొనుగోలు కోసం కట్టిన డబ్బు మొత్తం నామినీకి LIC చెల్లిస్తుంది.
ఆదాయ పన్ను ప్రయోజనం (Income Tax Benifit with Jeevan Akshay Policy)
జీవన్ అక్షయ్ పాలసీ కొనుగోలు కోసం చేసే వ్యయానికి ఆదాయ పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఈ పెన్షన్ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
నెలకు రూ.20 వేల పెన్షన్ కోసం ఎంత ప్రీమియం చెల్లించాలి? (Rs 20,000 Pension with Jeevan Akshay Policy)
ఒక వ్యక్తి ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పాలసీలో రూ.9,16,200 డిపాజిట్ చేస్తే.. నెలకు రూ.6,859 చేతికి వచ్చే అవకాశం ఉంది. సంవత్సరానికి రూ.86,265, 6 నెలలకు రూ.42,008, 3 నెలలకు రూ.20,745 వస్తుంది. నెలకు రూ.20,000 చొప్పున తీసుకోవాలంటే, పాలసీహోల్డర్ 40 లక్షల 72 వేల రూపాయలను సింగిల్ ప్రీమియం రూపంలో పెట్టుబడి పెట్టాలి.
మరో ఆసక్తికర కథనం: వివిధ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇవి, కొన్నిచోట్ల ప్రాసెసింగ్ ఫీజ్ కూడా లేదు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Stock Market Closing: స్టాక్ మార్కెట్ క్రాష్, కొనసాగుతున్న షార్ప్ సేల్స్ - నిఫ్టీ 300 పాయింట్లు పతనం
PM Kisan 19th Instalment: పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు రాబోతున్నాయ్ - లిస్ట్‌లో మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్ చేయండి!
Special Scheme For Women: రెండేళ్లలోనే లక్షాధికారులను చేసే స్కీమ్, FD కంటే ఎక్కువ రాబడి - మహిళలకు మాత్రమే
Credit Card Rewards: మీ క్రెడిట్ కార్డ్‌ను ఇలా వాడండి - ఈ ప్రయోజనాలన్నీ సొంతం చేసుకోండి!
New IPOs: డబ్బుతో సిద్ధంగా ఉండండి, త్వరలో 6 కొత్త IPOలు ప్రారంభం
New Ration Cards in Telangana: రేషన్ కార్డు జాబితాలో పేర్లు లేవా? ఆందోళన చెందకుండా ఇలా చేయాలన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
CM Revanth Davos Tour: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
Telugu TV Movies Today: పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, ‘భీమ్లా నాయక్’ టు ప్రభాస్ ‘బిల్లా’, ‘యోగి’, ‘మిర్చి’ వరకు- ఈ బుధవారం (జనవరి 22) టీవీలలో వచ్చే సినిమాలివే
Tiger in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ కనిపించిన పెద్దపులి- మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు అటవీశాఖ అనుమానం