By: ABP Desam | Updated at : 15 Nov 2023 02:32 PM (IST)
వివిధ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇవి
Best home loan rates in various banks in india: కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయడం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పెద్ద పండుగ. ఇల్లు చిన్నదైనా/పెద్దదైనా, సొంత ఇంట్లో (Own House) నివశించే దర్జానే వేరు. ఇల్లు ఎంత విశాలంగా, ఆధునికంగా ఉన్నా.. అద్దె ఇల్లు అద్దె ఇల్లే. కాబట్టి, ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని తాపత్రయపడతాడు. కొందరు, రుణ భారం లేకుండానే ఇంటిని సొంతం చేసుకుంటే, మరికొందరికి అప్పు (Housing Loan) చేయక తప్పదు. అప్పుడు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల దగ్గరకో, బ్యాంక్ చెంతకో చేరాల్సి వస్తుంది.
హోమ్ లోన్ (home loan) అనేది, ఒక వ్యక్తి తన జీవితంలో తీసుకునే అతి పెద్ద రుణం కావచ్చు. అమౌంట్‌తో (Loan Amount) పాటు, అప్పు తీర్చే సమయం (Loan Tenure) కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఇలాంటి లాంగ్‌టర్మ్ లోన్ల విషయంలో, అప్పు తీసుకున్న డబ్బు కంటే రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, హోమ్ లోన్ విషయంలో కీలకమైన విషయం వడ్డీ రేటు (home loan interest rate). ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీకి గృహ రుణం దొరికితే, అది బెస్ట్ హోమ్ లోన్ రేట్ (Best home loan rate) అవుతుంది.
దేశంలోని కొన్ని బ్యాంకులు గృహ రుణంపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు:
బ్యాంక్ ఆఫ్ ఇండియా -------- 8.30-10.75% -------- 2023 డిసెంబర్ 31 వరకు ప్రాసెసింగ్ ఫీజ్ రద్దు
బ్యాంక్ ఆఫ్ బరోడా --------- 8.40-10.60% -------- ప్రాసెసింగ్ ఫీజ్ లేదు
కెనరా బ్యాంక్ -------- 8.40-11.25% -------- 2023 డిసెంబర్ 31 వరకు ప్రాసెసింగ్ ఫీజ్ రద్దు
ఇండియన్ బ్యాంక్ --------- 8.40-10.20% -------- ప్రాసెసింగ్ ఫీజ్ 0.25% వరకు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ --------- 8.40-9.55% -------- ప్రాసెసింగ్ ఫీజ్ 0.50% వరకు (గరిష్టంగా రూ.25 వేలు) + GST
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ------------ 8.40-10.80% ---------- ప్రాసెసింగ్ ఫీజ్ 0.50% (గరిష్టంగా రూ.5 వేలు) + GST
IDBI బ్యాంక్ ---------- 8.45-12.25% --------- ప్రాసెసింగ్ ఫీజ్ రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు
UCO బ్యాంక్ --------- 8.45-12.60% --------- ప్రాసెసింగ్ ఫీజ్ 0.50% (కనిష్టం రూ.1,500, గరిష్టం రూ.15,000)
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ------- 8.50-10.10% -------- 31 మార్చి 2024 వరకు ప్రాసెసింగ్ ఫీజ్ రద్దు
HDFC బ్యాంక్ --------- 8.50-9.40% -------- ప్రాసెసింగ్ ఫీజ్ 0.50% లేదా రూ.3,000 (ఏది ఎక్కువయితే అది) + GST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ---------- 8.60-9.65% --------- ప్రాసెసింగ్ ఫీజ్ 0.35% (కనిష్టం రూ.2 వేలు, గరిష్టం రూ.10 వేలు) + GST
యాక్సిస్ బ్యాంక్ --------- 8.70% -------- ప్రాసెసింగ్ ఫీజ్ 1% వరకు (కనీసం రూ.10 వేలు) + GST
నోట్: 09 నవంబర్ 2023 వరకు ఆయా బ్యాంక్‌ల అధికారిక వెబ్‌సైట్లలో ఉన్న సమాచారం ఇది.
మరో ఆసక్తికర కథనం: డేంజర్ బెల్స్, అలా జరిగితే స్టాక్ మార్కెట్‌లో మహా పతనం, ముందుంది మొసళ్ల పండుగ!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు
Adani Stocks: అదానీ గ్రూప్ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్