By: Arun Kumar Veera | Updated at : 20 Dec 2024 10:42 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 20 డిసెంబర్ 2024 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: భవిష్యత్‌లో వడ్డీ రేట్ల కోత నెమ్మదిగా ఉంటుందన్న యూఎస్ ఫెడ్ కామెంట్ల తర్వాత, ఇప్పుడు, చైనాలో వడ్డీ రేట్ల కోతలపై ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టారు. దీంతో, గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు $2600 మార్క్ దగ్గర కదులుతోంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,613 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 330 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 300 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 250 రూపాయల చొప్పున తగ్గాయి. ఈ రెండు రోజుల్లోనే బంగారం 10 గ్రాముల ధర రూ.1000 వరకు పడిపోయి నగలు చవకగా మారాయి. ఈ రోజు కిలో వెండి ధర 1,000 రూపాయలు దిగి వచ్చింది. ఈ రెండు రోజుల్లో ఇది కిలోకు రూ.2000 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 76,800 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,400 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 57,600 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 98,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 76,800 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 70,400 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 57,600 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 98,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 76,800 | ₹ 70,400 | ₹ 57,600 | ₹ 98,000 |
విజయవాడ | ₹ 76,800 | ₹ 70,400 | ₹ 57,600 | ₹ 98,000 |
విశాఖపట్నం | ₹ 76,800 | ₹ 70,400 | ₹ 57,600 | ₹ 98,000 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,040 | ₹ 7,680 |
ముంబయి | ₹ 7,040 | ₹ 7,680 |
పుణె | ₹ 7,040 | ₹ 7,680 |
దిల్లీ | ₹ 7,055 | ₹ 7,695 |
జైపుర్ | ₹ 7,055 | ₹ 7,695 |
లఖ్‌నవూ | ₹ 7,055 | ₹ 7,695 |
కోల్‌కతా | ₹ 7,040 | ₹ 7,680 |
నాగ్‌పుర్ | ₹ 7,040 | ₹ 7,680 |
బెంగళూరు | ₹ 7,040 | ₹ 7,680 |
మైసూరు | ₹ 7,040 | ₹ 7,680 |
కేరళ | ₹ 7,040 | ₹ 7,680 |
భువనేశ్వర్ | ₹ 7,040 | ₹ 7,680 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 6,742 | ₹ 7,286 |
షార్జా (UAE) | ₹ 6,742 | ₹ 7,286 |
అబు ధాబి (UAE) | ₹ 6,742 | ₹ 7,286 |
మస్కట్ (ఒమన్) | ₹ 6,896 | ₹ 7,338 |
కువైట్ | ₹ 6,579 | ₹ 7,178 |
మలేసియా | ₹ 6,844 | ₹ 7,126 |
సింగపూర్ | ₹ 6,792 | ₹ 7,536 |
అమెరికా | ₹ 6,637 | ₹ 7,063 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 50 తగ్గి రూ. 25,160 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!
UPI Payments Record: ఫోన్ తియ్, స్కాన్ చెయ్ - యూపీఐని మామూలుగా వాడడం లేదుగా!
Stock Market Crash: '1996 పీడకల' రిపీట్ అవుతుందా, 30 ఏళ్ల రికార్డ్ బద్ధలవుతుందా? - స్టాక్ మార్కెట్‌లో ఒకటే టెన్షన్
Bank Holidays In March: మార్చి నెలలో బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు - ఇదిగో ఫుల్ హాలిడేస్ లిస్ట్
Gold-Silver Prices Today 01 Mar: రూ.87000కు దిగొచ్చిన పసిడి రేటు - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Gas Cylinder Price Hike: పండుగలు, పెళ్లిళ్ల టైమ్‌లో జనం నెత్తిన 'బండ' - పెరిగిన గ్యాస్ సిలిండర్ రేట్లు
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘనవిజయం.. నాకౌట్ జట్ల ఖరారు.. రేపు కీలక మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు