search
×

ITR 2024: ఐటీఆర్‌లో ఈ విషయాన్ని మర్చిపోతే రూ.10 లక్షల ఫైన్‌, చూసుకోండి మరి!

IT Return Filing 2024: ఇన్‌కం ట్యాక్స్‌ సబ్మిట్ చేసేటప్పుడు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. మన ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలు ఇవ్వాలి. పొరపాటు జరిగిందో భారీ మూల్యం తప్పదు.

FOLLOW US: 
Share:

Income Tax Return Filing 2024: ఆదాయాలు అనేక రకాలు. ఉద్యోగం, వ్యాపారం, సేవలు వంటి మార్గాల్లో డబ్బు సంపాదించొచ్చు. కొంతమంది మన దేశంలో ఉండి ఆర్జిస్తే, మరికొందరు ఫారిన్‌ వెళ్లి డాలర్లను వేటాడుతారు. వీళ్లు కాకుండా... ఒక ఆర్థిక సంవత్సరంలో కొన్ని నెలలు ఇండియాలో ఆదాయం సంపాదించిన తర్వాత, ఏదైనా ఆఫర్‌ వస్తే విదేశాలకు వెళ్లి అక్కడ ఫారిన్‌ కరెన్సీ పోగేసే వాళ్లు ఉన్నారు. అంటే, ఒకే ఆర్థిక సంవత్సరంలో.. కొంతకాలం భారత్‌లో రూపాయలను, మరికొంత కాలం విదేశీ గడ్డపై డాలర్లను సంపాదిస్తుంటారు. అలాంటి వ్యక్తులు ఆదాయ పన్ను ఎలా చెల్లించాలి, ITRలో ఏయే అంశాలను రిపోర్ట్‌ చేయాలి?.

భారతీయ నివాసి (Indian Resident) 
ఒక వ్యక్తి, ఒక ఆర్థిక సంవత్సరంలో 182 రోజులు భారతదేశంలోనే ఉంటే, చట్ట ప్రకారం అతన్ని భారతీయ నివాసి లేదా ఇండియన్‌ రెసిడెంట్‌గా పరిగణిస్తారు. భారతీయ నివాసి స్వదేశంలోనైనా, విదేశాల్లో అయినా సంపాదించే ఆదాయం మొత్తం భారతదేశ ఆదాయ పన్ను చట్టం పరిధిలోకి వస్తుంది. భారతదేశ ఉద్యోగి తరహాలోనే ఆ వ్యక్తికి కూడా ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనలు ‍‌(Income Tax Act Rules‌), పన్ను రేట్లు (Tax Slabs) వర్తిస్తాయి.

'డబుల్ టాక్సేషన్ ఎవాయిడెన్స్ ఎగ్రిమెంట్' (DTAA)
విదేశీ జీతం ఉన్న వ్యక్తి 'డబుల్ టాక్సేషన్ ఎవాయిడెన్స్ ఎగ్రిమెంట్' గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ఒక వెసులుబాటు ఒప్పందం. దీనివల్ల, రెండు దేశాల్లోనూ ఆదాయ పన్ను కట్టే బాధ తప్పుతుంది. ఒకవేళ, ఆ విదేశంతో భారత్‌కు 'డబుల్ టాక్సేషన్ ఎవాయిడెన్స్ ఎగ్రిమెంట్' లేకపోతే, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 91 ప్రకారం ఉపశమనం పొందొచ్చు.

విదేశాల నుంచి ఆదాయం ఆర్జిస్తే ITR ఎలా ఫైల్‌ చేయాలి?
ఒక వ్యక్తి, విదేశాల్లో ఉద్యోగం చేసి అందుకున్న జీతాన్ని 'ఇన్‌కమ్ ఫ్రమ్ శాలరీ' విభాగంలో చూపించాలి. విదేశీ కరెన్సీలో పుచ్చుకున్న జీతాన్ని భారతీయ రూపాయిల్లోకి మార్చి చూపాలి. విదేశీ కంపెనీ వివరాలు కూడా సమర్పించాలి. జీతంపై ముందస్తు పన్ను (TDS) కట్‌ అయితే, దానిని ఐటీ రిటర్న్‌లో చూపి రిఫండ్‌ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. మన దేశంలో పెట్టిన పెట్టుబడులు, వ్యయాలకు సంబంధించి డిడక్షన్స్‌ లేదా ఎగ్జమ్షన్స్‌ వంటివి వర్తిస్తే, సంబంధిత సెక్షన్ల (80C, 80D వంటివి) కింద వాటిని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. విదేశాల్లో పొందే డిడక్షన్స్‌ను మాత్రం ఇండియాలో ఉపయోగించుకూడదు. విదేశాల్లో ఆస్తులు కూడబెడితే, ఫారిన్‌ అసెట్స్‌‍ (FA) గురించి ITRలో సమాచారం ఇవ్వాలి. విదేశాల్లో బ్యాంక్‌ అకౌంట్‌ ఉన్నా కూడా తెలియజేయాలి. 

రూ.10,00,000 జరిమానా!
విదేశాల నుంచి వచ్చిన ఆదాయం గురించి ఉద్దేశపూర్వకంగా లేదా పొరపాటున టాక్స్‌ పేయర్‌ (Taxpayer) వెల్లడించకపోతే, ఆదాయ పన్ను విభాగం అతనికి నోటీస్‌ పంపుతుంది. ఆ నోటీస్‌కు ప్రతిస్పందనగా పన్ను చెల్లింపుదారు ఇచ్చిన వివరణపై ఐటీ డిపార్ట్‌మెంట్‌ సంతృప్తి చెందకపోతే చట్ట ప్రకారం చర్య తీసుకుంటుంది. బ్లాక్ మనీ (వెల్లడించని విదేశీ ఆదాయం & ఆస్తులు) & టాక్స్‌ యాక్ట్‌ 2015 కింద 10 లక్షల రూపాయల వరకు ఫైన్‌ విధించే అవకాశం ఉంది.

మరో ఆసక్తికర కథనం: డెడ్‌లైన్‌ దగ్గర పడింది - ఆధార్‌-పాన్‌ ఇలా లింక్‌ చేయండి, స్టేటస్‌ చెక్‌ చేసుకోండి

Published at : 30 May 2024 12:33 PM (IST) Tags: Income Tax IT Returns ITR-1 ITR 2024 Foreign Income

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 23 Nov: మళ్లీ రూ.80,000లకు చేరిన స్వర్ణం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

Gold-Silver Prices Today 23 Nov: మళ్లీ రూ.80,000లకు చేరిన స్వర్ణం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

Bank Locker Rules: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!

Bank Locker Rules: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!

Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ

Safe Investment: రిస్క్‌ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్‌ ఆప్షన్‌ దొరకవు!

Safe Investment: రిస్క్‌ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్‌ ఆప్షన్‌ దొరకవు!

House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌

House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌

టాప్ స్టోరీస్

Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!

Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!

Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..

Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..

Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్

Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్