By: ABP Desam | Updated at : 31 Jan 2024 05:36 PM (IST)
2023లో వచ్చిన కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు
ITR Filing 2024: 2023-24 ఆర్థిక సంవత్సరం (Financial Year 2023-24) ఆఖరు త్రైమాసికంలో ఉన్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మార్చి 31తో ముగుస్తుంది. ఆ తర్వాతి నుంచి, ఆదాయ పన్నును డిక్లేర్ చేసే పని ప్రారంభం అవుతుంది. సాధారణంగా, లేట్ ఫైన్ లేకుండా ఐటీఆర్ పైల్ చేయడానికి జులై 31వ తేదీ వరకు గడువు ఉంటుంది. లేట్ ఫైన్‌తో కలిపి ఐటీఆర్ పైల్ చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం ఇస్తారు.
2023 బడ్జెట్‌లో, ఆదాయపు పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది, కొత్త రూల్స్ (Income Tax New Rules) ప్రకటించింది. బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) చేసిన కీలక ప్రకటనల్లో ఒకటి కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని (New Income Tax Regime) డిఫాల్ట్ పన్ను విధానంగా చేయడం.
వాస్తవానికి, కొత్త పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2020 బడ్జెట్‌లోనే ప్రవేశపెట్టింది. అయితే, దీనిని డిఫాల్ట్‌గా చేస్తున్నట్లు 2023 బడ్జెట్‌లో ప్రకటించింది. కొత్త పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులు (Exemptions), తగ్గింపులు (Deductions) ఉండవు. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ఇన్‌కమ్ టాక్స్ సెక్షన్ 80C, 80CCC కిందకు వచ్చే టాక్స్ బెనిఫిట్స్ (Tax benefits) లభించవు.
2023లో వచ్చిన 5 కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు:
1. కొత్త పన్ను విధానంలో తగ్గిన స్లాబ్‌లు (New Income Tax Regime Slabs):
కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చి, తికమకను తగ్గించి, ఎక్కువ మంది ఫాలో అయ్యేలా చేసేందుకు... కేంద్ర ప్రభుత్వం స్లాబ్స్ నంబర్‌ను తగ్గించింది. కొత్త పన్ను విధానంలో ఇప్పుడు 5 స్లాబ్స్ ఉన్నాయి:
రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు మొదటి శ్లాబ్, దీనిపై 5 శాతం పన్ను;
రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు రెండో శ్లాబ్, దీనిపై 10 శాతం పన్ను;
రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు మూడో శ్లాబ్, దీనిపై 15 శాతం పన్ను;
రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు నాలుగో శ్లాబ్, దీనిపై 20 శాతం పన్ను;
రూ. 15 లక్షల పైన ఎంతున్నా ఐదో శ్లాబ్, దీనిపై 30 శాతం పన్ను చెల్లించాలి.
2. పన్ను రాయితీ పెంపు (Tax Rebate):
కొత్త పన్ను విధానంలో, కేంద్ర ప్రభుత్వం రాయితీల పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచింది. అంటే రూ. 7 లక్షల లోపు వార్షిక ఆదాయం (annual income) ఉన్న వ్యక్తులు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
3. ప్రామాణిక తగ్గింపు/స్టాండర్డ్ డిడక్షన్ వర్తింపు (Standard Deduction):
కొత్త పన్ను విధానానికి కూడా రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను కేంద్రం ఆపాదించింది. గతంలో, పాత పన్ను విధానానికే ఇది పరిమితమైంది.
4. డెట్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై పన్ను బాదుడు (Taxation on Debt Mutual Fund Investment):
2023 మార్చి 31 తర్వాత డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులకు లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్ను ప్రయోజనం లభించదని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రకటించారు. అంటే, డెట్ మ్యూచువల్ ఫండ్స్ మూలధన లాభాలు షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG) కిందకు వస్తాయి. ఫలితంగా, ఆ డబ్బు పన్ను చెల్లింపుదారు ఆదాయంలో కలుస్తుంది, సంబంధిత స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. దీనివల్ల ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది.
5. హై నెట్‌వర్త్ వ్యక్తులకు సర్‌చార్జ్‌లో కోత (High Networth Individuals లేదా HNIs):
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్ల కంటే పైబడిన ఆదాయంపై సర్‌ఛార్జ్ రేటును 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది.
మరో ఆసక్తికర కథనం: ఈ చిట్కాలు పాటిస్తే ఐటీఆర్ ప్రాసెస్ త్వరగా పూర్తవుతుంది, రిఫండ్ పెరుగుతుంది!
Major Changes From February: గ్యాస్ బండ నుంచి UPI వరకు - ఫిబ్రవరి 01 నుంచి దేశంలో 5 కీలక మార్పులు
UPI Payments: UPI లావాదేవీలు ఫిబ్రవరి 01 నుంచి బంద్ - మీ పేమెంట్ ఫెయిల్ కావచ్చు!
Gold-Silver Prices Today 31 Jan: ఒక్కరోజులో రూ.13,100 పెరిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Unclaimed Money: మీరు వదిలేసిన బ్యాంక్ అకౌంట్‌లో చాలా డబ్బు ఉండొచ్చు - ఆ డబ్బును ఇలా విత్‌డ్రా చేయండి
Budget 2025: శనివారం కూడా డబ్బు సంపాదించే ఛాన్స్ - బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్‌కు 'నో హాలిడే'
Union Budget 2025: నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం
Budget 2025 And Stock Market : బడ్జెట్‌లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
WhatsApp Governance: వాట్సాప్ ద్వారా తిరుమల టిక్కెట్‌లు కూడా బుక్ చేసుకోవచ్చా ? - మన మిత్ర పని తీరు ఎలా ఉంది ?