By: ABP Desam | Updated at : 08 Jan 2024 01:05 PM (IST)
ఈ చిట్కాలు పాటిస్తే ఐటీఆర్ ప్రాసెస్ త్వరగా పూర్తవుతుంది
ITR Filing 2024: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ (FY24) లేదా 2024-25 అసెస్‌మెంట్ ఇయర్‌రకు (AY25) సంబంధించి, ఆదాయ పన్ను విభాగం ఇప్పటికే ITR-1, ITR-4 ఫారాలను నోటిఫై చేసింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, బడ్జెట్ తర్వాత, 2023 ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్స్ ఇచ్చిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT), 202-24 ఆర్థిక సంవత్సరానికి 22 డిసెంబర్ 2023నే నోటిఫికేషన్స్ ఇచ్చింది.
అంతేకాదు, సాధారణంగా, ఐటీఆర్ దాఖలు చేయడానికి ఏటా జులై 31 వరకు (ఆలస్య రుసుము లేకుండా) గడువు ఉంటుంది. ఈసారి, ఈ గడువుకు ఏడు నెలల ముందే నోటిఫై చేయడం విశేషం.
ఫామ్-16లో చూపిన దానికంటే ఎక్కువ పన్నును ఆదా చేయడం సాధ్యం కాదని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవం వేరు. సరైన అవగాహన ఉంటే, ఫామ్-16లో కనిపించిన దాని కంటే ఎక్కువ టాక్స్ సేవ్ (tax saving) చేయవచ్చు. అంతేకాదు, ఎక్కువ రిఫండ్ (Income Tax Refund) క్లెయిమ్ చేయడం చాలా సాధ్యమే.
ITR మీద ఎక్కువ టాక్స్ రిఫండ్ పొందే చిట్కాలు:
అనుకూలమైన టాక్స్ రెజిమ్ (tax regime)
మ్యాగ్జిమమ్ టాక్స్ రిఫండ్ పొందడానికి, పాత/కొత్త పన్ను విధానాల్లో మీకు ఏ విధానం సరిపోతుందో చెక్ చేయాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అకౌంట్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ELSS), జీవిత బీమా పాలసీల వంటి దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల్లో మీరు పెట్టుబడి పెట్టకపోతే; హోమ్ లోన్ మీద వడ్డీ, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పన్ను మినహాయింపులు (tax deductions) లేకపోతే.. కొత్త పన్ను విధానం (new tax regime) మీకు సూట్ అవుతుంది. దీనిలో స్లాబ్ ప్రకారం టాక్స్ రేట్లు ఉంటాయి; డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్ ఉండవు.
ఇన్ టైమ్‌లో ITR ఫైల్ చేయడం
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139(1) ప్రకారం.. నిర్దేశించిన గడువు తేదీలోగా టాక్స్ పేయర్ ITRను ఫైల్ చేయాలి. ఆలస్యమైన/డేట్ మిస్ అయిన రిటర్న్‌పై సెక్షన్ 234F కింద ఫైన్ కట్టాల్సి వస్తుంది. మీకు, 'పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం' (taxable income) రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, ఈ ఫైన్ రూ. 5,000 వరకు ఉంటుంది.
డేటాను సరిచూసుకోండి
ఫామ్-26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో (AIS) కనిపించే డేటాను, మీ వాస్తవ ఆదాయంతో సరిపోల్చుకోండి.
రిటర్న్‌ను ఒక నెలలోగా ఈ-వెరిఫై చేయండి
ఇన్‌కమ్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత, దానిని ఒక నెల లోపు ఈ-వెరిఫై (E-verify) చేయాలి. అంటే, మీరు ఫైల్ చేసిన రిటర్న్‌ను ధృవీకరించాలి. ఈ-వెరిఫై తర్వాత మాత్రమే రిటర్న్ ప్రాసెస్/ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ పని ప్రారంభం అవుతుంది. మీరు మీ రిటర్న్‌ను ఎంత త్వరగా వెరిఫై చేస్తే, రిఫండ్ అంత త్వరగా మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.
తగ్గింపులు, మినహాయింపుల గుర్తింపు
పన్ను విధించదగిన ఆదాయం నుంచి మీరు క్లెయిమ్ చేయగల డిడక్షన్స్, ఎగ్జమ్షన్స్‌ను సరిగ్గా, పూర్తి అవగాహనతో లెక్కించండి. దీనివల్ల, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. తద్వారా రిఫండ్ మొత్తం పెరుగుతుంది.
మరో ఆసక్తికర కథనం: బోలెడు బెనిఫిట్స్ ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలి, ఎవరు అర్హులు?
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
SBI Loan: లోన్ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్!
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?