By: ABP Desam | Updated at : 08 Jan 2024 12:18 PM (IST)
కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలి, ఎవరు అర్హులు?
How to Apply for Kisan Credit Card: బ్యాంక్‌లు జారీ చేసే కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో బోలెడు ప్రయోజనాలు (Benefits of Kisan Credit Card) ఉన్నాయి. ముఖ్యంగా, కేవలం పావలా వడ్డీకే (4%) రూ.3 లక్షల వరకు అప్పు లభిస్తుంది. దీనిలో, రూ. 1.60 లక్షల వరకు తీసుకునే లోన్‌కు బ్యాంక్‌లు ఎలాంటి షూరిటీ అడగవు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కూడా రుణం పొందొచ్చు.
అప్పుగా తీసుకున్న డబ్బుతో గేదెలు, ఎడ్లు వంటి పశువులను కొనుక్కోవచ్చు. వ్యవసాయ పరికరాలను సమకూర్చుకోవడానికీ ఉపయోగించుకోవచ్చు. లేదా, రైతు సొంత అవసరాల కోసం వాడుకోవచ్చు, దీనిపై ఎలాంటి షరతులు లేవు.
అప్పును తిరిగి తీర్చే విషయంలోనూ రుణగ్రహీతకే సౌలభ్యం చేకూర్చేలా ఆప్షన్లు ఉన్నాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో (KCC) పాటు అర్హులైన రైతులకు స్మార్ట్ కార్డ్, డెబిట్ కార్డ్, సేవింగ్స్ అకౌంట్ కూడా అదనంగా లభిస్తాయి.
ఒకవేళ, ఏదైనా ప్రమాదం జరిగిన KCC హోల్డర్ శాశ్వత వైకల్యం లేదా మరణానికి గురైతే, ఆ కుటుంబానికి రూ.50 వేల వరకు బీమా డబ్బు వస్తుంది. ఇతర ప్రమాదాల విషయంలో వైద్య ఖర్చుల కోసం రూ.25,000 అందుతుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్‌లు, కోపరేటివ్ బ్యాంక్‌లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు మంజూరు చేస్తాయి. కాబట్టి... KCC క్రెడిట్ లిమిట్, వడ్డీ రేటు బ్యాంక్‌ను బట్టి మారుతుంది. సగటున, KCC వడ్డీ రేటు 2 శాతం నుంచి 4 శాతం వరకు (KCC interest rate) ఉంది. ఇప్పుడు, కేసీసీలను ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) లింక్ చేశారు. కాబట్టి ఆ కార్డ్‌లను PM కిసాన్ క్రెడిట్ కార్డ్‌లు అని కూడా పిలుస్తున్నారు.
KCC కోసం ఎవరు అప్లై చేసుకోవచ్చు? (Who can apply for KCC?)
పొలం సాగు చేస్తున్న యజమాని లేదా కౌలు రైతు
రైతు సంఘాల గ్రూప్‌లోని వ్యక్తులు, వీరు సాగు చేస్తున్న పొలం యజమానులై ఉండాలి
మత్స్యకారులు, మత్య్స రైతులు
పశు పోషణ వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో ఉన్న రైతులు లేదా పాడి రైతులు
ఫిషరీస్ మరియు పశుపోషణ కింద ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులు:
గొర్రెలు, కుందేళ్లు, మేకలు, పందులు, పక్షులు, కోళ్ల పెంపకం రైతులు
KCC కోసం అవసరమైన పత్రాలు (Required Documents for KCC Loan Scheme)
దరఖాస్తు ఫారం
ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వ్యక్తిగత గుర్తింపు డాక్యుమెంట్. ఇవి దరఖాస్తుదారు ప్రస్తుత చిరునామాతో ఉండాలి
భూమి పత్రాలు
దరఖాస్తుదారు పాస్‌పోర్ట్ సైజు ఫోటో
బ్యాంక్ కోరిన సెక్యూరిటీ PDC వంటి ఇతర ఇతర పత్రాలు
కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ (Online Application Process for Kisan Credit Card)
స్టెప్ 1: KCC కోసం మీరు కోరుకున్న బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి
స్టెప్ 2: ఆప్షన్స్ నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ను ఎంచుకోండి
స్టెప్ 3: 'అప్లై' బటన్‌పై క్లిక్ చేస్తే, అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది
స్టెప్ 4: అవసరమైన వివరాలత ఫారాన్ని పూరించండి, 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేయండి
స్టెప్ 5: ఇది పూర్తయితే, అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ మీకు మెసేజ్ వస్తుంది
స్టెప్ 6: మీకు అన్ని అర్హతలు ఉంటే, 3-4 పని దినాల్లో బ్యాంక్ మిమ్మల్ని సంప్రదిస్తుంది.
ఆఫ్‌లైన్ ప్రక్రియ (Offline Application Process for Kisan Credit Card)
బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి, అక్కడి సిబ్బంది సాయంతో దరఖాస్తు నింపండి. పూర్తి చేసిన అప్లికేషన్ ఫారాన్ని, అవసరమైన పత్రాలను సంబంధిత బ్యాంక్ అధికారికి ఇవ్వండి. మిగిలిన పని బ్యాంక్ చూసుకుంటుంది.
మరో ఆసక్తికర కథనం: మరింత పతనమైన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
New Year Financial Planning: ఇలాంటి ఫైనాన్షియల్ ప్లాన్‌తో కొత్త సంవత్సరం ప్రారంభించండి - ఏడాదంతా మీకు తిరుగుండదు!
Bank Timings Changed: బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్ - అన్ని బ్యాంకుల పని వేళల్లో మార్పులు
Bank Cheque: బ్యాంక్ చెక్కుల్లో 9 రకాలు - ఏది, ఎక్కడ ఉపయోగిస్తారో మీకు తెలుసా?
Gold-Silver Prices Today 18 Dec: ఈ రోజు చవకగా బంగారం కొనే అవకాశం - మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Investment Secret: డబ్బులు సంపాదించే ట్రిక్ - ఈ బడా ఇన్వెస్టర్ల సీక్రెట్ ఎవరూ మీకు చెప్పి ఉండరు!
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఛాయిస్!