By: Arun Kumar Veera | Updated at : 30 Jan 2025 01:39 PM (IST)
కమోడిటీస్ మార్కెట్‌లో ప్రత్యేక సెషన్ ( Image Source : Other )
Stock Market News Updates: బడ్జెట్ సమర్పణ తేదీకి అతి చేరువలోకి వచ్చాం. ఫిబ్రవరి 01న, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశ బడ్జెట్ సమర్పించనున్నారు. ఈ బడ్జెట్ ద్వారా దేశ ప్రజలందరి ఆశలు & ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. స్టాక్ మార్కెట్ & కమోడిటీ మార్కెట్‌లోని పెట్టుబడిదార్లకు అది చాలా పెద్ద రోజు. ఈసారి బడ్జెట్ రోజు, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం నాడు వచ్చింది. ఆ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు తెరుచుకుంటాయా, లేదా అన్న ప్రశ్న పెట్టుబడిదార్లలో ఉంది.
కమోడిటీస్ మార్కెట్‌లో ప్రత్యేక సెషన్
శనివారం & ఆదివారం స్టాక్ మార్కెట్లకు సాధారణ సెలవు రోజులు. ఆ రెండు రోజుల్లో, ఈక్విటీ షేర్ల లావాదేవీలు జరిగే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE) & కమోడిటీస్ లావాదేవీలు జరిగే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) సెలవు తీసుకుంటాయి. అయితే, ఈ శనివారం మాత్రం ఈ మూడు ఎక్సేంజ్‌లు పని చేస్తాయి, ఆ రోజున బడ్జెట్ ఉండడమే కారణం. ఫిబ్రవరి 01, శనివారం నాడు MCXలో ట్రేడింగ్ జరుగుతుంది, దీనికోసం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించబోతోంది. బడ్జెట్ రోజున, మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి కమోడిటీ మార్కెట్ పెట్టుబడిదార్లు కూడా నష్టపోకుండా & ప్రయోజనం పొందేందుకు ఈ స్పెషల్ సెషన్ నిర్వహిస్తున్నారు. కమోడిటీ మార్కెట్ ఇండెక్స్ MCX ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లైవ్‌లో ఉంటుంది & సాధారణ రోజుల మాదిరిగానే ట్రేడ్ జరుగుతుంది.
MCX ప్రెస్ నోట్
జనవరి 29న విడుదల చేసిన మీడియా ప్రకటనలో. బడ్జెట్ సమర్పణ సమయంలో రియల్ టైమ్ రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం మార్కెట్ పార్టిసిపెంట్స్‌కు మద్దతు ఇచ్చేలా ఫిబ్రవరి 01న ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తున్నట్లు MCX తెలిపింది. దీంతో పాటు హెడ్జింగ్ అవసరాలను కూడా తీర్చుకోవచ్చు. అయితే, ఫిబ్రవరి 1వ తేదీన సెటిల్‌మెంట్ హాలిడే అని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. ఆ రోజున పే-ఇన్ లేదా పే-ఔట్ సాధ్యం కాదు.
జనవరి 31, 2025తో ముగిసే కాంట్రాక్టుల డెలివరీ సెటిల్‌మెంట్ క్యాలెండర్‌లో ఎలాంటి మార్పు ఉండదని MCX తన సర్క్యులర్‌లో పేర్కొంది. జనవరి 31, 2025 & ఫిబ్రవరి 01, 2025 నాటి ట్రేడ్ తేదీల సెటిల్‌మెంట్ ఫిబ్రవరి 03, 2025న జరుగుతుంది.
NSE & BSEలో కూడా సాధారణ ట్రేడింగ్
కమొడిటీస్ మార్కెట్ మాత్రమే కాకుండా.. భారతీయ స్టాక్ మార్కెట్లు NSE & BSE కూడా ఫిబ్రవరి 01వ తేదీ, శనివారం నాడు ఓపెన్‌లో ఉంటాయి. ఈ రెండు ఎక్సేంజీల్లో సాధారణ రోజుల మాదిరిగానే ట్రేడింగ్ జరుగుతుంది. NSE & BSE ఉదయం 9.15 గంటలకు ఓపెన్ అవుతాయి & మధ్యాహ్నం 3.30 వరకు పని చేస్తాయి. తద్వారా, ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి తమ పెట్టుబడులను కాపాడుకునే అవకాశం పొందుతారు, నష్టపోయే అవకాశాలను తగ్గించుకునే అవకాశం పొందుతారు. బాగా అనుభవం ఉన్న వ్యక్తులు ఈ హెచ్చుతగ్గుల నుంచి శనివారం నాడు కూడా డబ్బు సంపాదించే ఛాన్స్ పొందుతారు.
మరో ఆసక్తికర కథనం: 5 కంపెనీలు 'ఫ్రీ'గా షేర్లు ఇస్తున్నాయి, వీటిలో ఒక్కటయినా మీ పోర్ట్‌ఫోలియోలో ఉందా?
PF Withdrawal: పీఎఫ్ విత్‌డ్రా చేయడానికి రెండు ప్రధాన ఆప్షన్లు, ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం
New Banking Rules: ఈ ఏప్రిల్ నుంచి మారే బ్యాంకింగ్ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
10-Minute Smartphone Delivery: స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో హోమ్ డెలివెరీ - స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దూకుడు
Cash Withdraw: ATM నుంచి డబ్బు తీసే ముందు ఓసారి ఆలోచించండి, ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్
Gold-Silver Prices Today 26 Mar: మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్, సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update: డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజయం.. రాజస్థాన్ తో మ్యాచ్
UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు