By: ABP Desam | Updated at : 17 Jul 2022 11:46 AM (IST)
బులియన్ మార్కెట్లో బంగారం
Gold Price Today 16th July 2022: బులియన్ మార్కెట్‌లో నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర భారీగా పతనమైంది. రూ.1,900 మేర పతనం కావడంతో హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.60,400 అయింది. రూ.430 తగ్గడంతో నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 అయింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,730, కాగా 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.46,500 అయింది. వెండి కేజీ ధర రూ.60,400కి పతనమైంది.
ఏపీలో బంగారం ధరలు.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు క్షీణించాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 16th July 2022) 10 గ్రాముల ధర రూ.50,730 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,500 గా ఉంది. రూ.1,900 దిగిరావడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.60,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, తిరుపతిలో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,500 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.60,400 కు పడిపోయింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధర..
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.46,500 అయింది.
చెన్నైలో రూ.430 మేర పతనం కావడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,360 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,580 తో విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 అయింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కి దిగొచ్చింది.
తగ్గిన ప్లాటినం ధర
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.21,920కి చేరింది.
హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.21,610గా ఉంది.
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.21,920 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.21,610 అయింది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Top Loser Today August 17, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
RBI on Payment Systems: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లావాదేవీలపై ఛార్జీలు! ఆర్బీఐ సర్వే!
Gold-Silver Price: నేడు మరింత తగ్గిన గోల్డ్ రేట్ - సిల్వర్, ప్లాటినం కూడా
Top Loser Today August 16, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
Petrol-Diesel Price, 17 August: నేడు వాహనదారులకు శుభవార్త, చాలా దిగొచ్చిన ఇంధన ధరలు
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు
IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!
Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?