search
×

Gold Rate Today 26th June 2022: వినియోగదారులకు ఊహించని షాక్‌లు ఇస్తున్న బంగారం- ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 26 June 2022: వినియోగదారులను బంగారం ధరలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఒకరోజు పెరుగుతున్నాయి. మరో రోజు తగ్గుతున్నాయి. ఇదంతా ఒక రేషియోలో జరుగుతోంది.

FOLLOW US: 
Share:

Gold Price Today 26th June 2022: బంగారం కొనుగోలుదారులు మరొక రోజు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. మరోవైపు వెండి ధరలు తగ్గుముఖ పెట్టాయి. నిన్న రూ. 200మేర తగ్గిన బంగారం ధర ఇవాళ వందరూపాయలు పెరిగింది. తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,550 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారంపై 110 రూపాయలు పెరిగింది. దీంతో ఆ బంగారం ధర రూ.51,870కి పెరిగింది. హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.65,700 అయింది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,870, 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.47,550 అయింది. 

ఏపీలో బంగారం ధర.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర (Gold Rate in Vijayawada 26th June 2022) రూ.51,870 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,550గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.65,700 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

విశాఖపట్నం, తిరుపతిలో రూ.100 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,550 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.65,700 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.. 

ఏరియా 
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)
24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)
హైదరాబాద్ రూ.47,550        రూ.51,870
కరీంనగర్ రూ.47,550        రూ.51,870
వరంగల్  రూ.47,550        రూ.51,870
నిజామాబాద్ రూ.47,550        రూ.51,870
విజయవాడ రూ.47,550        రూ.51,870
విశాఖపట్నం రూ.47,550        రూ.51,870
తిరుపతి  రూ.47,550        రూ.51,870
కర్నూలు రూ.47,550        రూ.51,870

ప్రధాన నగరాల్లో బంగారం ధర..
ఢిల్లీలో రూ.50 పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,550 కి చేరింది. 
చెన్నైలో బంగారంపై రూ.70 పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,920 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,870గా ఉంది.

తగ్గిన ప్లాటినం ధర 
హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.22,840గా ఉంది. 
ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,840 అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,060కి చేరింది. 
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,340 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..

పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Published at : 26 Jun 2022 12:56 AM (IST) Tags: Gold Price Today Gold Price In Hyderabad Gold Rate in Andhra Pradesh Gold Rate Today In Telangana Gold Price Today 26th June 2022

ఇవి కూడా చూడండి

Year Ender 2024: హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌

Year Ender 2024: హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌

Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?

Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?

Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్‌ బ్యాంక్‌లు - హోమ్‌ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?

Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్‌ బ్యాంక్‌లు - హోమ్‌ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?

PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి

PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి

ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?

ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?

టాప్ స్టోరీస్

Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?

Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్

Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్

Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం

Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం